Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తీరా ఉదయాన్నే షట్టర్ తెరిచి చూడగా..

Eluru: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తీరా ఉదయాన్నే షట్టర్ తెరిచి చూడగా..

Ravi Kiran

|

Updated on: Jan 25, 2025 | 7:02 PM

మద్యం అమ్మకాలతో ఆ షాపునకు దండిగా డబ్బులు వచ్చిపడ్డాయ్. ఎంచక్కా నెక్స్ట్ రోజు ఆ డబ్బులు లెక్కపెట్టాలని అనుకున్నారు. మరుసటి రోజు షట్టర్ కి వేసిన తాళం తెరిచి చూడగా.. దెబ్బకు ఎదురుగా కనిపించిన సీన్ చూసి కళ్లు తేలేశారు యజమానులు. ఇంతకీ అసలేం జరిగిందంటే

ఇదేంటో.! ఈ మధ్యకాలంలో దొంగలకు బ్రాందీ షాపులే టార్గెట్‌గా మారాయి. ఊరు చివరన ఉన్న పలు బ్రాందీ షాపులపై పడి దొరికినకాడికి దొరికినంత దోచేస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో ఏలూరు జిల్లా ద్వారకతిరుమలలోని ఓ బ్రాందీ షాపులో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న శ్రీనివాస బ్రాందీ షాపులో దొంగలు పడి.. లక్ష రూపాయల నగదు, మూడు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. రాడ్ల సాయంతో ఆ షాపు షట్టర్ తెరవడం.. పైకప్పు మీదున్న రేకులు కొయ్యకుండా.. చాలా జాగ్రత్తగా షాపు షెడ్‌పై ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు దొంగలు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను పగలగొట్టి.. రికార్డయిన ఫుటేజ్‌ను ఎత్తుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి