మగువలకు షాక్.. మరింత పెరిగిన బంగారం ధర! వీడియో
బంగారం ధర తగ్గనంటోంది. కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.83 వేలు దాటింది. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.83,100కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.200 పెరిగి రూ.82,700కి చేరింది. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది.
క్రితం ట్రేడింగ్‌లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2780 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి 31.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపైనా ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరుగుతోందన్నారు నిపుణులు. కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మున్ముందు బులియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
