మనిషి గుండెకు జంతు రక్తనాళంతో చికిత్స.. పూర్తి ఉచితంగా ఈ అరుదైన ఆపరేషన్

అత్యంత్య అరుదైన శస్త్రచికిత్స ఉచితంగా చేయడమే కాకుండా విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు రాము ధన్యవాదాలు తెలిపాడు. దేశం మొత్తం మీద ఇటువంటి తరహా ఆపరేషన్లు రెండు మూడు మాత్రమే జరిగాయని వైద్యులు సురేంద్ర తెలిపారు. గతంలోనూ గుంటూరులో అత్యంత్య అరుదైన శస్త్రచికిత్సలు జరిగాయని మరోసారి ఇటువంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బ్రుందంపై స్థానికులు ప్రసంశల జల్లు కురిపిస్తున్నాడు.

మనిషి గుండెకు జంతు రక్తనాళంతో చికిత్స.. పూర్తి ఉచితంగా ఈ అరుదైన ఆపరేషన్
Rare Heart Surgery Success
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 28, 2025 | 9:25 PM

నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాము గత కొంతకాలంగా కడునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉండే వైద్యులకు వద్దకు చికిత్స కోసం వెళ్లాడు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు గుండె నుండి శరీరానికి రక్తం సరఫరా చేసే రక్త నాళం దెబ్బతిని రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందుకోసం అరుదైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. నెల్లూరు నుండి మద్రాసు వెళ్లి వైద్యులను కలవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు చెన్నై వెళ్లిన రాము ఆపరేషన్ కోసం ఇరవై ఐదు లక్షల అవుతుందని తెలుసుకొని చికిత్స చేయించుకోలేక నెల్లూరు తిరిగి వచ్చేశాడు.

అయితే ఇటువంటి వాటికి గుంటూరులోని వికాస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తారని తెలుసుకొని గుంటూరు వచ్చాడు. అన్ని వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఖర్చు అధికంగా అవుతుందని అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందిస్తామని రాముకి చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా అనుమతి ఇవ్వడంతో డాక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసేందుకు వైద్య బ్రుందం సిద్దమైంది.

అయితే దెబ్బతిన్న రక్తనాళాన్ని తీసివేసి అదే సమయంలో ఇతర జంతువులకు చెందిన రక్తనాళాన్ని ఆపరేషన్ ద్వారా అతికించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అత్యంత్య క్లిష్టమైన శస్త్రచికిత్స కావడంతో వైద్య బ్రుందం చాలెంజ్ గా తీసుకొని ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం రాము కూడా పూర్తిగా కోలుకున్నాడు. అత్యంత్య అరుదైన శస్త్రచికిత్స ఉచితంగా చేయడమే కాకుండా విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు రాము ధన్యవాదాలు తెలిపాడు. దేశం మొత్తం మీద ఇటువంటి తరహా ఆపరేషన్లు రెండు మూడు మాత్రమే జరిగాయని వైద్యులు సురేంద్ర తెలిపారు. గతంలోనూ గుంటూరులో అత్యంత్య అరుదైన శస్త్రచికిత్సలు జరిగాయని మరోసారి ఇటువంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బ్రుందంపై స్థానికులు ప్రసంశల జల్లు కురిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌ ప్రజల దుస్థితి ఇలా ఉంటుందా..? చదువుకోవాలంటే ఇలా ప్రాణాలకు తెగించాల్సిందే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..