AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో సిగలో మరో రికార్డ్‌.. నింగిలో దూసుకెళ్లిన GSLV-F15.. 100వ రాకెట్‌తో సక్సెస్‌

ISRO: నావిక్‌ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం..

ISRO: ఇస్రో సిగలో మరో రికార్డ్‌.. నింగిలో దూసుకెళ్లిన GSLV-F15.. 100వ రాకెట్‌తో సక్సెస్‌
Subhash Goud
|

Updated on: Jan 29, 2025 | 7:14 AM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన  ఇస్రో.. తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో. బుధవారం నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి ఉదయం 6.23 గంటలకు GSLV-F15ని నింగిలోకి ప్రయోగించి రికార్డ్‌ సృష్టించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

ISRO అంతరిక్ష పరిశోధనా కేంద్రం భారతదేశం గర్వించదగిన వాటిలో ఒకటి. ప్రపంచ దేశాలు పోటీ పడి అంతరిక్ష పరిశోధనలు చేస్తుండగా.. ఇస్రో కూడా వాటికి సమాంతరంగా ఎన్నో అధ్యయనాలు చేపడుతోంది. చంద్రయాన్, మంగళయాన్‌తో సహా ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా ఇస్రో భారతదేశాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసింది. ఈ దశలో భారత్ తన 100వ రాకెట్‌ను ప్రయోగించి మరో చారిత్రక కీర్తిని అందుకుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ నారాయణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణన్‌ ఛైర్మన్ అయిన తర్వాత తొలి ప్రయోగం ఇది.

నావిక్‌ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్‌ సెంటర్‌లో రూపొందించగా.. ఇతర శాటిలైట్‌ సెంటర్లు సహకారం అందించాయి.

Gslv F15

నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారతీయ వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం (PVT) సేవలను అందించడానికి రూపొందించబడింది. ఈ సేవల కొనసాగింపును నిర్ధారించడానికి NVS-01/02/03/04/05 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో.

NVS-02 ఈ NVS సిరీస్‌లో రెండవ ఉపగ్రహం. దీని బరువు 2250 కిలోలు, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 3 kW. ఖచ్చితమైన సమయ అంచనాను నిర్ధారించడానికి, NVS-02 స్వదేశీ, దిగుమతి చేసుకున్న రుబిడియం అటామిక్ గడియారాలతో అమర్చారు శాస్త్రవేత్తలు. దీని జీవితకాలం దాదాపు 12 సంవత్సరాలు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..