AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

ఓ జంట దూర ప్రాంతం బైక్ పై వెళ్లారు. తీరా తిరిగి వస్తుండగా బైక్ లో పెట్రోల్ అయిపోయిందని గమనించారు. అందుకే ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నారు. బంక్ నుంచి ముందుకు కాస్త నడిచారు. ఆపై కిక్ కొడదామని ప్రయత్నించగా..

AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా
Representative Image
S Srinivasa Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 30, 2025 | 10:42 AM

Share

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద పెను ప్రమాదం తప్పింది. బంకులో పెట్రోల్ కొట్టించి కాస్త ముందుకు వెళ్లి కిక్ కొట్టగానే బైకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరుబుజ్జిలి మండలం కొండవలసకి చెందిన అల్లాడ రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై ఆమదాలవలస వచ్చారు. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలు పెట్రోల్ కొట్టించాడు. అనంతరం బైక్‌ను స్టార్ట్ చేసే క్రమంలో సెల్ఫ్ ప్రెస్ చేయగా బైక్ స్టార్ట్ కాలేదు. దాంతో బైక్‌ను కాస్త ముందుకు తీసుకువెళ్లి కిక్ కొట్టి స్టార్ట్ చేయగా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి.

దాంతో అక్కడే బైక్‌కి సైడ్ స్టాండ్ వేసి భయంతో భార్యాభర్తలు పక్కకు పరుగులు పెట్టారు. వెంటనే పెట్రోల్ బంకు సిబ్బంది ప్రమాదాన్ని గమనించి మంటలపై ఇసుక, బకెట్‌తో నీరు జల్లగా కాసేపటికి మంటలు కంట్రోల్ అయ్యాయి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పొరపాటున మంటలు పెట్రోల్ బంకు ట్యాంక్‌లకు విస్తరించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఇటీవల ఎలక్ట్రిక్ బైక్‌లలోని బ్యాటరీలు హీట్ ఎక్కి బైక్ తగలబడటం లేదా బ్యాటరీలు పేలిపోవటం వంటివి తరచూ జరుగుతూ ఉండేవి. అయితే ఈసారి ప్రమాదానికి గురైంది పెట్రోల్ బైక్ కావటం విశేషం. దూర ప్రయాణం వల్ల బైక్ ఇంజిన్ హీట్ ఎక్కిపోయి ఉండటం, కిక్ కొట్టే సమయంలో కిక్ రాడ్ వద్ద ఘర్షణ వల్ల నిప్పు రవ్వలు వచ్చి ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అక్కడి వారు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!