AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: దువ్వాడ, దివ్వెల మాధురి కొత్త వ్యాపారం.. పెట్టుబడి ఎంతో తెలిస్తే బిత్తరపోతారు

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఇపుడు కొత్త ఎపిసోడ్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కోట్ల రూపాయల పెట్టుబడితో సరికొత్త వ్యాపారానికి సిద్దం అవుతున్నారు ఈ జంట. వాణితో కలహాలు.. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు.. గుళ్లు, గోపురాల సందర్శన.. విహార యాత్రలు..

AP News: దువ్వాడ, దివ్వెల మాధురి కొత్త వ్యాపారం.. పెట్టుబడి ఎంతో తెలిస్తే బిత్తరపోతారు
Duvvada Srinivas
S Srinivasa Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 30, 2025 | 1:01 PM

Share

వరుస కాంట్రవర్శిలతో తెగ వైరల్ అయిన దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి జంట జీవితంలో మరింతగా బలపడేందుకు సీరియస్‌గా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది. దివ్వెల మాధురికి ఉన్న ఆసక్తి మేరకు వస్త్ర రంగంలో సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పబోతోంది. వ్యాపారం అంటే ఏదో సాదాసీదాగా కాదు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టబోతోంది మాధురి, శ్రీను జంట. తమ మొదటి వస్త్ర దుకాణాన్ని హైదరాబాద్‌లోని చందానగర్‌లో ప్రారంభించబోతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 21న ప్రారంభోత్సవం చేయటానికి ముహూర్తం కూడా ఖరారైంది. తాము పెట్టబోయే వస్త్ర దుకాణానికి కాంచీపురం వకులా సిల్క్స్ అని పేరు కూడా ఫిక్స్ చేసేసారు. చందానగర్లో కొత్త దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే హైదరాబాద్‌లో మరో వస్త్ర దుకాణంతో పాటు, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ తమ మాల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు.

వ్యాపారంపై చాలా సీరియస్‌గానే దృష్టి పెట్టింది ఈ జంట. కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుండటంతో గత కొన్ని నెలలుగా వ్యాపారానికి అవసరమయ్యే డబ్బులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా హౌరా బ్రిడ్జి, కాశీ వంటి వివిధ ప్రాంతాల బ్యాక్ గ్రౌండ్‌లో తెగ వైరల్ అవుతోన్న ఈ జంట ఫోటోలు కూడా వ్యాపారం పని మీద తిరుగుతున్నప్పుడు తీసుకున్నవేనట. గత కొన్ని నెలలుగా ఇదే పని మీద దేశం నలుమూలలా తిరుగుతూ రేర్ కలక్షన్స్ సమీకరిస్తున్నారట. పట్టు చీరల కలెక్షన్స్ కోసం ఇప్పటికే కోల్‌కతా, బెనారస్, ధర్మవరం, కంచి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమకు నచ్చిన పట్టు చీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేస్తూ స్వామికార్యం, స్వకార్యం అన్నట్టు ఒకవైపు వ్యాపారాన్ని, మరోవైపు విహారయాత్రలను కానిచ్చేస్తోంది ఈ జంట.

దివ్వెల మాధిరికి ముందు నుంచి సారీస్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన వద్ద ఇప్పటికే ఎన్నో రకాల విలువైన పట్టు చీరలు ఉన్నాయి. తాను ధరించే పట్టు చీరలను ప్రదర్శిస్తూ పలు రీల్స్ కూడా చేసి అందరినీ ఆకర్షించుకుంది మాధురి. ఇక కోలాటం, కిట్టీ పార్టీలు, సోషల్ మీడియా వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి కాస్త లేడీస్ నెట్‌వర్క్ ఉంది. ఇక భిన్న సంస్కృతుల సమ్మేళనంగా, సాప్ట్‌వేర్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌ లాంటి మహానగరంలో నాణ్యత ప్రమాణాలు బాగుండాలే కానీ.. వ్యాపారానికి ఏమాత్రం ఢోకా ఉండదన్న ధీమాతో తమ వ్యాపారానికి హైదరాబాద్‌ను అనువైనదిగా ఈ జంట ఎంచుకుంది. ఇక ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ పదవికాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు దువ్వాడ, దివ్వెల జంట వ్యవహార శైలి నచ్చక జిల్లా పార్టీ ఆయనతో అంటీ అంటనట్టు వ్యవహరిస్తోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇప్పుడే ఆర్దికంగా బలోపేతం కావాలని ఈ జంట వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. కొద్ది నెలల పాటు హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యాపారాన్ని దగ్గరుండి చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మాధురి అభిరుచి, ఆసక్తిని బట్టి వస్త్ర వ్యాపార రంగంలోకి ముందడుగు వేసారు. అయితే ఈ వ్యాపారం వెనుక మాధురి ఒత్తిడి ఉందన్నవారు లేకపోలేదు. వ్యాపారం పట్ల మాధురికి ఉన్న చిత్తశుద్దిని వాణి సన్నిహితులు కొందరు శంకిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దువ్వాడ శ్రీను రాజకీయంగానే కాదు ఆయనకు వ్యాపారంలోనూ అనుభవం ఉంది. దువ్వాడ వాణితో కలిసి ఉన్నప్పుడు కలర్ గ్రానైట్ వ్యాపారం చేసిన అనుభవం ఉంది. అప్పట్లో కలర్ గ్రానైట్ వ్యాపారం ఆయనకు బాగానే కలిసి వచ్చింది. అయితే తర్వాత రాజకీయ వేధింపులు కారణంగా ఆ వ్యాపారం కొంత ఒడిదొడుకులను ఎదుర్కొంది. దాని తర్వాత తిరిగి ఇప్పుడు మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెడుతున్నాడు దువ్వాడ శ్రీను. మరి శ్రీనుకి ఈ వ్యాపారం ఏమేర కలిసి వస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి