Telangana: సీఎం ప్రెస్‌మీట్‌లో అజ్ఞాత వ్యక్తి.. అతడి ఐడీ కార్డు చెక్ చేయగా.. అందరూ షాక్
తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి గుట్టురట్టు అయింది. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చిన ఓ వ్యక్తికి ఇంటెలిజెన్స్ టీమ్ షాకిచ్చింది… దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం… అదేంటో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడీతో చెలామణి అవుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావును ఇంటెలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ సెక్రటేరియట్‌లో హల్చల్ చేస్తున్న భాస్కర్‌రావుపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ టీమ్ ఎట్టకేలకు గుట్టురట్టు చేసింది. భాస్కర్‌రావుకు సహకరించిన డ్రైవర్ రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు కలసి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దానిపైనా విచారణ చేపట్టారు. ఇతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్‌తోపాటు.. డ్రైవర్ రవి ఫేక్ ఐడీ తయారు చేయడానికి సహకరించినట్టు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి