AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anatapur District: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సీదా వెళ్లిపోయిన డ్రైవర్.. కట్ చేస్తే..

తెలియని దారిలో వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని కొంత మంది చెరువుల్లోకి, అడవుల్లోకి.. పంట పొలాల్లోకి.. కాలవల్లోకి వెళ్లిన సందర్భాలు చూశాం. కానీ ఓ లారీ డ్రైవర్ రాత్రి పూట దారి తెలియక గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే... అది కాస్తా కొండల్లోకి తీసుకెళ్లి వదిలేసింది. దారి తెలియక కొండ లోయల్లోకి వెళ్లి లారీ డ్రైవర్ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.

Anatapur District: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సీదా వెళ్లిపోయిన డ్రైవర్.. కట్ చేస్తే..
Lorry
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 01, 2025 | 2:20 PM

Share

కర్ణాటక రాష్ట్రం నుంచి తాడిపత్రికి ఐరన్ లోడుతో కంటైనర్ ట్రాలీ లారీతో డ్రైవర్ ఫరూక్ బయల్దేరాడు. రాత్రి సమయంలో అనంతపురం జిల్లా యాడికి మండలం రామన్న గుడిసెల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడటంతో దారి తెలియక డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు. ఇంకేముంది గూగుల్ మ్యాప్ గమ్యస్థానానికి చేరుస్తుంది కదా.. అనుకుని డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్లినా గమ్యస్థానం రావడం లేదు.. అదేవిధంగా మొత్తం కొండల్లోకి దారి చూపించింది గూగుల్ మ్యాప్… గుడ్డిగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని వెళ్లిన లారీ డ్రైవర్ ఫరూక్.. యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి భారీ కంటైనర్ ఉన్న లారీని తీసుకెళ్లాడు. అలా చాలా దూరం కొండల్లోకి వెళ్లిన తర్వాత గాని దారి తప్పానని… గూగుల్ మ్యాప్ రూట్ తప్పుగా చూపించిందని అతను గ్రహించాడు. చేసేదేమీ లేక చీకట్లోనే కంటైనర్ లారీని వెనక్కి తిప్పుతుండగా కొండ లోయల్లోకి లారీ ఒరిగిపోయింది. లారీ లోయలోకి పడిపోతుందని గ్రహించిన డ్రైవర్ ఫరూక్ వెంటనే క్రిందకు దిగి… స్థానికులకు, పోలీసులకు సమాచార ఇచ్చాడు. లోయలోకి ఒరిగిపోయిన లారీని జెసిబిల సాయంతో స్థానికులు పైకి తీశారు. గూగుల్ మ్యాప్ ఎంత పని చేసింది అనుకున్న లారీ డ్రైవర్ ఫరూక్… కొంచెం ఉంటే ప్రాణాలు పోయే అనుకుని… ఊపిరి పీల్చుకున్నాడు. అందుకే గుడ్డి గూగుల్ ‌ మ్యాప్‌ను ఫాలో అవ్వకుండా.. స్థానికంగా కనిపించిన వారితో ఓ సారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!