Vikarabad: కూలీలకు డబ్బులు పంచుతుండగా నోట్లపై ఏదో రాసి ఉంది.. ఏంటని చూడగా
ఆ మహిళ ఓ CSC సెంటర్ నుంచి రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లను తీసుకుంది. జనవరి 31న కూలీలకు జీతం డబ్బులు ఇస్తుండగా.. ఆ నోట్లపై ఏదో రాసి ఉన్నట్టు గమనించింది. ఇంతకీ అదేంటి అని చూడగా..
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. డబ్బులు డ్రా చేసేందుకు జనవరి 24న స్థానికంగా ఉన్న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లిన సుగుణమ్మ అనే మహిళకు రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లు ఇచ్చాడు ఆ సెంటర్ నిర్వాహకుడు. ఇక జనవరి 31, శుక్రవారం కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లేక్కిస్తుండగా నకిలీ నోట్లను గుర్తించింది సదరు మహిళ. ఇదే విషయంపై CSC సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అయితే ఆ నోట్లన్నీ కూడా ఆ CSC సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపిస్తోంది మహిళ. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, నకిలీ నోట్లన్ని కూడా స్పెసిమెన్ నోట్లు అని.. ఆ నోట్లపై ‘SPECIMEN NOT FOR SALE’ అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

