Kadapa Election Result 2024: కడపలో సేమ్ సీన్ రిపీట్.. వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే.?
Kadapa Lok Sabha Election Result in telugu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దాదాపుగా అన్ని చోట్ల కూటమి అభ్యర్ధులు విజయకేతనం ఎగురవేశారు. అయితే కడప లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దాదాపుగా అన్ని చోట్ల కూటమి అభ్యర్ధులు విజయకేతనం ఎగురవేశారు. అయితే కడప లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. పలు రౌండ్లలో వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉంటే.. మరికొన్ని రౌండ్లలో వైఎస్ షర్మిల పైచేయి సాధించారు. ఒక ఎండ్‌లో షర్మిల విజయం దిశగా పయనిస్తోందని అనుకున్న సమయంలో.. ఆమె చివరికి మూడో స్థానానికి సరిపెట్టుకుంది. వైసీపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి విజయం సాధించారు. అవినాష్ రెడ్డి మొత్తంగా 5,96,207 ఓట్లు రాగా.. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్ధి భూపేష్ రెడ్డికి 5,30,305 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన షర్మిలకు 1,35,737 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. గతంలో అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచి 7,83,499 ఓట్లకు గాను 63.79 శాతం ఓట్లు సాధించారు. 2019 పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఓటమి చవిచూశారు. కేవలం 4,02,773 ఓట్లు సాధించారు. అంటే దాదాపు 32.79శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ ఆవినాష్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి శ్రీనివాసులు చేతిలో ఘన విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ ఆవినాష్ రెడ్దికి 55.95శాతం ఓటు షేర్ రాగా 6,71,983 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం అభ్యర్థి శ్రీనివాసులుకు 40.1 ఓటు షేర్‌తో 4,81,660 ఓట్లు పోలయ్యాయి. ఇక మెజార్టీ విషయానికి వస్తే.. 2014లో వైఎస్ అవినాష్ రెడ్డికి 1,90,323 ఓట్ల మెజార్టీ రాగా.. 2019లో 3,80,726 మెజార్టీ సాధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఏపీ లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
