Andhra Pradesh Assembly Election 2024 Result Highlights: ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు, పవన్.. మోడీతో భేటీ
Andhra Pradesh Lok Sabha Election Result 2024 Highlights in telugu: ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. భారీ సీట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే చంద్రబాబు ఈనెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ 132 సీట్లలో, జనసేన 19 సీట్లలో, బీజేపీ 7 స్థానాల్లో, వైసీపీ 18 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Andhra Pradesh Lok Sabha Election Result 2024 Highlights in telugu: ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. భారీ సీట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే చంద్రబాబు ఈనెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ 132 సీట్లలో, జనసేన 19 సీట్లలో, బీజేపీ 7 స్థానాల్లో, వైసీపీ 18 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు ఏపీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీల వారిగా వస్తే.. 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 33 ప్రాంతాల్లోని 401 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మొదటగా వస్తాయని.. తొలుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 26వేల 473 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ ద్వారా.. 26 వేల 721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. మరికొద్దీ కొద్దీ గంటల్లో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE NEWS & UPDATES
-
ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు, పవన్
ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన ప్రధాని మోదీతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రాబు, పవన్ ఇద్దరూ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈనెల తొమ్మిదో తేదీన అమరావతిలో జరిగే.. తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు
-
ఇవి చారిత్రాత్మక ఎన్నికలు: చంద్రబాబు
తమకు అఖండ విజయం కట్టబెట్టిన ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. ‘ప్రజలు గెలవాలి…రాష్ట్రం గెలవాలి అనే మా పిలుపును ప్రజలు గెలిపించారు. రాజకీయ పార్టీలు సక్రమంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే పార్టీలు, వ్యక్తులు కనుమరుగు అవుతారు. నా జీవితంలో ఇలాంటి చారిత్రాత్మక ఎన్నికలు చూడలేదు. కూలీ పనులు కోసం వెళ్లిన వారు వచ్చి ఓట్లు వేశారు.. టీడీపీ చరిత్రలో చారిత్రాత్మక ఎన్నికలు. టీడీపీ ఆవిర్భావంతో 202 సీట్లు వచ్చాయి. కారణాలు ఎక్కువ చెప్పనవసరం లేదు..అనుభవించిన వారికి తెలుసు. అహంకారం తో ఏదంటే అది చేస్తానంటే ప్రజలు విశ్వసించరు. ఒక పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ రెడ్డి ఒక కేస్ స్టడీ. మాకు ఇది అధికారం కాదు…బాధ్యత…మేము సేవకులం అని గుర్తు పెట్టుకుని పని చేస్తాం. అవినీతి,అక్రమాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. రాష్ట్ర అప్పులు ఎంత చేశారో ఏమీ తెలియదు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
-
-
జనసేన పార్టీ కార్యాలయానికి చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని అభినందించుకున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
-
బద్వేల్ లో బీజేపీ అభ్యర్థి ఇంట విషాదం..
బద్వేల్ బిజెపి అబ్యర్ది బొజ్జా రోషన్న చిన్నమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం టివిలో ఎన్నికల కౌంటింగ్ చూస్తూ బొజ్జా బాలమ్మ కన్నుమూశారు. రోషన్న ఓడిపోతున్నాడనే ఆందోళనతో మృతి చెందినట్లు తెలుస్తోంది. రోషన్న వెనుకంజ అని టివిలలో రావడంతో గుండెపోటు రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అంతలోపే బాలమ్మ కన్నుమూశారు.
-
చంద్రబాబు మీడియా సమావేశం..
బుధవారం (05.06.2024) ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు
-
-
ప్రమాణస్వీకారానికి శర వేగంగా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 9 న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శర వేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన సామాగ్రి ఇప్పటికే తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. 12 లారీల్లో వచ్చిన భారీ టెంట్లు, స్టేజి నిర్మాణ సామాగ్రిని రాయపూడిలో ఉంచారు. ప్రమాణ స్వీకారానికి సంబంధంచి ఈరోజు టీడీపీ నేతలు.. స్థల పరిశీలన చేయనున్నారు.
-
ఢిల్లీకి పవన్…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేయనున్నారు.
-
సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం
బుధవారం (జూన్ 05) సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగనుంది. కూటమిలో ఉన్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా ఎన్డీఏ పక్ష నేతలు ఈ మీటింగ్ కు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.
-
చంద్రబాబు ను కలవనున్న సీఎస్, డీజీపీ
ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో సిఎస్ జవహర్ రెడ్డి,డీజీపీ హరీష్ కుమార్ గుప్తా టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో కాబోయే ముఖ్యమంత్రి కి సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందనలు తెలపనున్నారు.
-
ఇప్పటం గ్రామంలో వైఎస్ ఆర్ విగ్రహం ద్వంసం.
తాడేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటం గ్రామంలో కొందరు వైఎస్ ఆర్ విగ్రహం ద్వంసం. మొత్తం నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు. గ్రహంతోపాటు శిలా ఫలకాన్ని పగులగొట్టారు. .
-
అనకాపల్లి పార్లమెంటు (లోక్ సభ ) నియోజకవర్గంలో టీడీపీదే హవా..
అనకాపల్లి పార్లమెంటు (లోక్ సభ ) నియోజకవర్గం
బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ విజయం.. 2, 96, 530 మెజార్టీ
సీఎం రమేష్ కు పోలైన ఓట్లు 7,62,069
సమీప అభ్యర్థి వైసీపీ బూడి ముత్యాల నాయుడు కు పోలైన ఓట్లు 4,65,539
అసెంబ్లీ నియోజకవర్గాలు
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
టిడిపి అభ్యర్థి అయ్యన్న పాత్రుడు విజయం.. 24,676 మెజార్టీ
అయ్యన్న కు పోలైన ఓట్లు 99,849
సమీప అభ్యర్థి వైసీపీ ఉమా శంకర్ గణేష్ కు పోలైన ఓట్లు 75,173
నోటా (3810+14 = 3824)
———-
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం
జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ విజయం.. 48,956 మెజార్టీ
విజయ్ కుమార్ కు పోలైన ఓట్లు 1,09,443
సమీప అభ్యర్థి వైసీపీ రమణమూర్తి రాజు కు పోలైన ఓట్లు 60487
నోటా (2400+9 = 2409)
———-
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు 65,764 మెజార్టీ
కోణతాలకు పోలైన ఓట్లు 115126
ఈవీఎంలలో పోలైన ఓట్లు 113185+ పోస్టల్ ఓట్స్ 1941
సమీప అభ్యర్థి వైసీపీ భరత్ కు పోలైన ఓట్లు 49,362
నోటా (1827+26 = 1853)
———-
మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
టిడిపి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి 28,026 మెజార్టీ
బందారుకు పోలైన ఓట్లు 91,869
ఈవీఎంలలో పోలైన ఓట్లు 90,092+ పోస్టల్ ఓట్స్ 1777
సమీప అభ్యర్థి వైసీపీ అనురాధ కు పోలైన ఓట్లు 63,843
నోటా (4060+10 = 4070)
————
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం
టిడిపి అభ్యర్థి వంగలపూడి అనితకు 43727 మెజార్టీ
అనిత కు పోలైన ఓట్లు 1,20,042
ఈవీఎంలలో పోలైన ఓట్లు 1,18,675+ పోస్టల్ ఓట్స్ 1367
సమీప అభ్యర్థి వైసీపీ కంబాల జోగులు పోలైన ఓట్లు 76,315
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నోటా (4090+17 = 4107)
———–
మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
టిడిపి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి 28,026 మెజార్టీ
బందారుకు పోలైన ఓట్లు 91,869
ఈవీఎంలలో పోలైన ఓట్లు 90,092+ పోస్టల్ ఓట్స్ 1777
సమీప అభ్యర్థి వైసీపీ అనురాధ కు పోలైన ఓట్లు 63,843
నోటా (4060+10 = 4070)
-
ఉమ్మడి పశ్చిమగోదావరి లో మొదటి సారి అసెంబ్లీ కి ఎన్నిక అయిన వారు :
1. బొమ్మిడి నాయకర్, నర్సాపురం, జనసేన
2. బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, జనసేన
3. రఘురామ కృష్ణంరాజు, ఉండి, టిడిపి
4. బడేటి రాధాకృష్ణ, ఏలూరు, టిడిపి
5. సొంగా రోషన్ కుమార్, చింతలపూడి, టిడిపి
6. చిర్రి బాలరాజు, పోలవరం, టిడిపి
7. పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు, జనసేన
8. మద్ధిపాటి వెంకటరాజు, టిడిపి, గోపాలపురం
9. కందుల దుర్గేష్ , నిడదవోలు
గెలిచిన మాజీ మంత్రులు:
1. పీతాని సత్యనారాయణ, టిడిపి, ఆచంట (నాలుగు సార్లు యం.యల్.ఎ)
హ్యాట్రిక్ విజయం : నిమ్మల రామానాయుడు
మూడుసార్లు: 1. చింతమనేని ప్రభాకర్, టిడిపి, దెందులూరు
2.. పులపర్తి రామాంజనేయులు, టిడిపి, భీమవరం
రెండు సార్లు: 1. ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు
2. తణుకు : ఆరుమిల్లి రాధాకృష్ణ – టిడిపి
-
పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ
మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు
జనసేన కార్యాలయం లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు
-
టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
తిరుపతి: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా టీటీడీ ఈవోకు భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా లేఖ ఆగస్టులో టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన
-
ప్రజల తీర్పును శిరసావహిస్తాంః విజయ సాయిరెట్టి
రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తామని వైసిపి పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ఎవరైనా తీర్పును శిరసా వహించాల్సిందే అన్నారు. ఈ ఓటమికి గల కారణాలు పార్టీ అధ్యక్షుడితో చర్చించి, తరువాతి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
-
గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, కుమారుడు శ్రీ అకీరా నందన్, సినీ హీరో శ్రీ సాయి ధరమ్ తేజ్ విచ్చేశారు
-
రేపు డిల్లీకి చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బీజేపీ పెద్దలను ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే కేంద్రంలోె ఎన్డీయే సర్కార్ ఏర్పాటుకు సంబంధించి కీలక చర్చలు జరిపే అవకాశముంది.
-
ఏలూరులో టీడీపీ అభ్యర్థి లీడ్
ఏలూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్
ఏలూరు టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి 61261 ఓట్ల మెజారిటీతో విజయం
చింతలపూడి టీడీపీ అభ్యర్ధి సొంగ రోషన్ కుమార్ 26,972 ఓట్లతో విజయం
ఉంగుటూరు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు 44107 ఓట్లతో విజయం..
పోలవరం జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజు 7436ఓట్లతో విజయం
దెందులూరు టిడిపి అభ్యర్థి చింతామనేని ప్రభాకర్ 26,266 ఓట్లతో విజయం
నూజివీడు టిడిపి అభ్యర్థి పార్థసారథి 12221 ఓట్లతో విజయం
కైకలూరు బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు 44735 ఓట్లతో విజయం
-
ఉమ్మడి అనంతపురం జిల్లాలో NDA క్లీన్ స్వీప్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీఏ కూటమి
14 స్థానాల్లో 13 టిడిపి, ఒకటి బిజెపి గెలుపు
హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్
రాప్తాడులో ఓటమి ఎరుగని పరిటాల సునీత… మరోసారి గెలుపు
ఉరవకొండ సెంటిమెంటును తిరగరాసిన పయ్యావుల కేశవ్
-
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో టిడిపి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. కూల్ డ్రింక్ సీసాలతో వైసిపి కార్యకర్తలు దాడి చేయడంతో టీడీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామంలో సీఎం జగన్ ఫోటోతో ఉన్న నేమ్ బోర్డును కిందపడేశారు టీడీపీ కార్యకర్తలు.
-
చంద్రబాబుకు రఘవీరారెడ్డి శుభాకాంక్షలు
ట్విట్టర్‌లో చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ నేత రఘవీరారెడ్డి. స్పెషల్ స్టేటస్ సాధించే అవకాశం వచ్చింది…ఇండియా కూటమి అన్నీ నెరవేర్చటానికి సిద్ధంగా వుందన్నారు రఘువీరా. ఇలాంటి సమయంలో ఇండియా కూటమితో ఉంటారా లేక ఎన్డీఏతో వెళ్తారా అని ప్రశ్నించారు రఘువీరారెడ్డి.
-
గవర్నర్ అపాయంట్‌మెంట్ కోరిన జగన్
ఏపీ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు సీఎం జగన్. రాజ్‌భవన్‌కు వెళ్లే సీఎం జగన్ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు జగన్. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు సీఎం జగన్.
-
బాబు, మోదీ, అమిత్ షా పరస్పర అభినందనలు
భారత్‌లో తిరిగి బీజేపీ కూటమి అధికారంలోకి రానుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు..ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రతిగా మోదీ, అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
-
ఈనెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మెజార్టీ సీట్లను గెలుచుకున్న టీడీపీ కూటమి నుంచి చంద్రబాబు సీఎంగా ఈనెల 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా…ఎన్డీఏ కూటమి నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వనించనున్నారు.
-
21కి 21 స్థానాల్లో జనసేన విజయం
జనసేనపార్టీ పోటీ చేసిన 21 సీట్లలో గెలుపు దిశగా వెళుతోంది. ఇటు పార్టీ ఆఫీస్‌లోను…అటు చేబ్రోలులోను పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నాగబాబు, ఆయన భార్య, పవన్ సోదరి భావోద్వేగానికి లోనయ్యారు. గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే పవన్ కల్యాణ్…మంత్రి వర్గం కూర్పుపై చర్చలు జరిపే వీలుంది.
-
ఓటమి పాలైన రాష్ట్ర మంత్రులు
ఏపీ ఎన్నికల ఫలితాల్లో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి..తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత చెల్లుబోయిన వేణుపై 61 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి బోణీ చేశారు. మంత్రులు బొత్స, ధర్మాన, బుగ్గన, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, అంబటి, ఆదిమూలపు సురేష్, రోజా, కాకాణి, విడదల రజనీ, మేరుగు నాగార్జున ఓడిపోయారు. పెద్దిరెడ్డి ఒక్కడే గెలుపు దిశగా వెళుతున్నాడు.
-
అన్ని జిల్లాల్లోను కూటమి అభ్యర్ధులదే హవా
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోను కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యత కనపడింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీనిచ్చింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకుపోయింది. అధికారం మార్పే లక్ష్యంగా ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో గెలుపు బాట పట్టారు. వైసీపీ కేవలం 12 సీట్లలోనే ముందంజలో ఉంది.
-
పాడేరులో విశ్వేశ్వరరాజు గెలుపు
అనంతపురం -1,81,676 ఓట్ల ఆధిక్యంలో లక్ష్మీనారాయణ (టీడీపీ) హిందూపురం ఎంపీ -1,13,173 ఓట్ల ఆధిక్యంలో పార్థసారధి (టీడీపీ) శ్రీకాళహస్తి -31వేల ఆధిక్యంలో బొజ్జల సుధీర్ (14వ రౌండ్) తిరుపతి – 25వేల ఓట్ల లీడ్‌లో ఆరణి శ్రీనివాసులు (8వ రౌండ్) పాడేరులో వైసీపీ విజయం 19,865 ఓట్ల మెజార్టీతో విశ్వేశ్వరరాజు గెలుపు
-
కైకలూరులో బీజేపీ విజయం
కైకలూరులో బీజేపీ విజయం 44,735 ఓట్లతో కామినేని శ్రీనివాసరావు గెలుపు మాడుగులలో టీడీపీ విజయం 20వేల ఓట్లతో గెలిచిన బండారు సత్యనారాయణ కర్నూలు ఎంపీ -32,300 ఓట్ల ఆధిక్యంలో నాగరాజు (టీడీపీ) బాపట్ల ఎంపీ -లక్షా 37వేల ఓట్ల ఆధిక్యంలో కృష్ణప్రసాద్ (టీడీపీ)
-
కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై డీకే అరుణ గెలుపు
-మహబూబ్‌నగర్‌లో హోరాహోరీ పోరు -మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై డీకే అరుణ గెలుపు -గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి
-
రాజంపేటలో వైసీపీ విజయం..
రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసిన ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విజయం సాధించారు. టీడీపీ అబ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై విజయం సాధించారు.
-
పులివెందులలో జగన్ విజయం..
వైఎస్ జగన్ విజయం సాధించారు. పులివెందులలో జగన్ 61169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి జగన్ మెజారిటీ 30 వేలు తగ్గడం గమనార్హం.
-
హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించిన టీడీపీ కార్యకర్తలు..
వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును టీడీపీ కార్యకర్తలు తొలగించారు. యూనివర్సిటీపై ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరును ఏర్పాటు చేశారు.
-
తమ్మినేని ఓటమి..
తమ్మినేని సీతారాం ఓటమి మూటగట్టుకున్నారు. ఆమదాలవలసలో టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. కూన రవికుమార్ 33187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
-
Hindupur Winning Candidate: బాలకృష్ణ భారీ విజయం..
హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ విజయం సాధించారు. 31,602 ఓట్ల తేడాతో దీపికపై భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య మూడో సారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు.
-
పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా..
ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్నారు.
-
కుప్పంలో అల్లర్లు..
ఏపీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుప్పంలో గొడవలు జరుగుతున్నాయి. చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ దాడుల్లో పలువురికి గాయలయ్యాయి. ఓటమి జీర్ణించుకోలేక వైసీపీ దాడికి పాల్పడిందంటూ టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.
-
పవన్ కళ్యాణ్ భారీ విజయం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ గెలుపొందారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏకంగా 69169 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు.
-
అనకాపల్లి లోక్ సభ బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ కామెంట్స్..
వై నాట్ 175 ఏమైంది.? 175లో 5 తీసేశారు.
ప్రకృతిని విధ్వంసం చేశారు.. ఇది జగన్ కు మామూలు శిక్షకాదు.
గెలిచిన వారినుంచి ఫోన్లు వస్తున్నాయి.. వారిని రానిచ్చే పరిస్ధితిలేదు.
అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారు.. లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలి.
ఏపీ ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యం అన్నారు.
విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను ఎలా బాగు చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.
-
పులివెందులలో జగన్ మెజార్టీ ఎంతంటే..?
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17వ రౌండ్ ముగిసేసరికి 53 వేల మెజారిటీతో వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు.
-
విజయంపై ఆనందాన్ని మోదీ, షాలతో పంచుకున్న చంద్రబాబు..
చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.
మోదీ, అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు.
గెలుపుపై ఆనందాన్ని పంచుకున్న బాబు
-
కూటమి ఖాతాలో తణుకు, తాడేపల్లిగూడెం.. మెజార్టీ ఎంతంటే..
తణుకులో వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఓటమి.
టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 71,059 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తాడేపల్లిగూడెంలో ఘనవిజయం సాధించిన జనసేన
వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్ 61,510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
వైయస్‌ఆర్ జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ..
కమలాపురంలో జగన్ మేనమామ, వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం.
మైదుకూరులో తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల తేడాతో గెలుపు
కడప నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి విజయం.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి ఆంజాద్‌భాషా ఓటమి.
-
హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం..
హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించబోతున్న నందమూరి బాలకృష్ణ.
తన నివాసానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు.
ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన బాలయ్య.
-
చిత్తూరులో భారీ మెజారిటీ దిశగా కూటమి అభ్యర్థి..
చిత్తూరులో భారీ మెజారిటీ దిశగా కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు.
93, 311 ఓట్ల మెజారిటీ సాధించిన టిడిపి ఎంపీ అభ్యర్థి.
-
గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి గెలుపు..
తిరుపతి జిల్లా గంగాధర నెల్లూరులో టిడిపి అభ్యర్థి థామస్ విజయం.
దాదాపు 27 వేల ఓట్ల ఆధిక్యత.
-
ఏపీకి మంచి రోజులు వచ్చాయ్: సుజనా చౌదరి
ఏపీ ఎన్నికల ఫలితాలపైస సుజనా చౌదరి స్పందించారు. కూటమి గెలుపు తాను ఊహించిందేనని అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని తాను ముందు నుంచే చెప్పానన్న సుజనా, వైసీపీ ఓటమితో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు.
-
మోదీకి చంద్రబాబు ఫోన్..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, హోం మంత్రి అమిత్‌షాలకు ఫోన్ చేశారు. ఎన్డీయే కూటమి విజయం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి విజయంపై చంద్రాబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
నారా లోకేష్ విజయం..
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ గెలుపొందారు. 36 వేల మెజారిటీతో నారా లోకేష్ విజయం సాధించారు.
-
భారీ మెజారిటీ దిశగా పవన్ అడుగులు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో 14వ రౌండ్ ముగిసే సమయానికి పవన్ 61,152 ఓట్లతో కొనసాగుతున్నారు. దీంతో పవన్ విజయం దాదాపు ఖాయమైంది.
-
కొనసాగుతోన్న కూటమి ప్రభంజనం..
ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. భారీ సీట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే చంద్రబాబు ఈనెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ 132 సీట్లలో, జనసేన 19 సీట్లలో, బీజేపీ 7 స్థానాల్లో, వైసీపీ 18 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
-
భారీ మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. పిఠాపురంలో 11 రౌండ్లు ముగిసే సమయానికి పవన్ మెజారిటీ 50,671 వద్ద కొనసాగుతోంది. ఈ మెజారిటీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
కొనసాగుతోన్న కూటమి అభ్యర్థుల ఆధిక్యం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థల ఆధిక్యం కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణగారు 21151ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీడీపీ 32300 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక 12వ రౌండ్ ముగిసే సరికి ఆవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ 28500 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
-
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారు..
ఏపీలో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఈ నెల 9వ తేదీన అమరావతీలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 4వ సారి సీఎం ప్రమాణం చేయనున్నారు. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.
-
రిపీట్ అయిన స్పీకర్ సెంటిమెంట్..
ఎన్నికల ఫలితాల్లో మరోసారి స్పీకర్ సెంటిమెంట్ కొనసాగింది. 1999 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్లుగా పనిచేసిన వారు తర్వాతి ఎన్నికల్లో గెలిచినట్లు చరిత్రలో లేదు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటమి దిశగా అడుగులు వేస్తుండడంతో ఏపీలో మరోసారి స్పీకర్ సెంటిమెంట్ రిపీట్ అయినట్లు స్పష్టమవుతోంది.
-
పిఠాపురంలో కొనసాగుతోన్న పవన్ హవా..
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం పవన్ 40 వేలకిపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మరిన్ని రౌండ్స్ మిగిలి ఉండడంతో మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు..
ఏపీలో కూటమి ధాటికి వైసీపీ కీలక నేతలు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు.
-
ఏపీలో తొలి విజయం నమోదు..
ఏపీలో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50వేలకిపైగా ఓట్లతో భారీ విజయాన్ని అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై విజయం సాధించారు.
-
చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీస్ అధికారులు…
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో పోలీస్ అధికారులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కూటమి 160 సీట్లలో లీడ్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు బయలుదేరనున్నారు. పవన్ సైతం పిఠాపురంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
-
అమెరికాలో మొదలైన సంబరాలు..
ఏపీలో టీడీపీ కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న వేళ అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు సంబరాలు మొదలుపెట్టారు. ప్రవాసాంధ్రులు సంబరాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క మంత్రాలయం నియోజవర్గంలో మాత్రమే వైసిపి ఆధిక్యతలో ఉంది.
-
కొనసాగుతోన్న నారా లోకేష్ ఆధిక్యం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మూడు రౌండ్ల తర్వాత నారా లోకేష్ 11700 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక చోడవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి కేఎస్‌ఎన్ రాజు రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 3893 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య రెండో రౌండ్‌లో 4120 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కూటమి(టిడిపి )అభ్యర్థి అయ్యన్నపాత్రుడు మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి 5 వేల ఓట్లు ఆదిక్యంలో కొనసాగుతున్నారు. భీమవరం ఎన్నికల కౌంటింగ్ నుంచి వెనుతిరిగిన ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్. ఇక పాణ్యం టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి నాలుగు రౌండ్ ముగిసేసరికి 7635 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
-
సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు..
ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మొత్తం 154కిపైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక 20 లోక్ సభా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు ఏక పక్షంగా దూసుకుపోతున్నారు.
-
ఆధిక్యంలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పిఠాపురం నియోజకర్గంలో 20వేలకి పైగా ఓట్లతో ముందజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
-
కూటమి అభ్యర్థుల హవా.. వెనుదిరుగుతోన్న వైసీపీ అభ్యర్థులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. సుమారు 119 స్థానల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఇక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులంతా వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలో కొడాలినాని, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కౌంటింగ్ సెంటర్‌ను వెళ్లిపోయారు.
-
టీడీపీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు..
ఏపీలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
-
కూటమి అభ్యర్థుల హవా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 91 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
-
కొనసాగుతోన్న కూటమి అభ్యర్థుల ఆధిక్యం..
ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. సుమారు 100 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మంత్రులు అంబటి, బొత్స, అమర్నాథ్, రోజా, పెద్దిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. స్పీకర్ తమ్మినేని వెనుకంజంలో ఉన్నారు.
-
కొనసాగుతోన్న కూటమి అభ్యర్థుల లీడ్..
ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థుల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, తాడికొండలో తెదేపా అభ్యర్థి తెనాలి శ్రవణ్‌కుమార్, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు, సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్, గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి యరపతినేని కొనసాగుతున్నారు.
-
కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. లీడ్‌లో ఉంది వీళ్లే..
ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 1973 ఓట్లతో ముందంజలో ఉన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి ముందజలో ఉన్నారు. పూతలపట్టులో, నెల్లూరు సిటీలో, కుప్పంలో, గజపతినగరం, మైదుకూరు, మండపేట, కొవ్వూరులో టీడీపీ లీడింగ్‌లో ఉంది. ఇక పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. కడప పార్లమెంట్‌లో వైసీపీ, కొవ్వూరులో టీడీపీ, డోన్‌లో టీడీపీ, జగ్గంపేటలో టీడీపీ, కోవూరులో టీడీపీ లీడ్‌లో కొసాగుతోంది.
-
కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ఇవి లేటెస్ట్ ట్రెండ్స్
ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా వెనకంజలో ఉంది. ఇక కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందజలో ఉన్నారు. 2274 ఆధిక్యంలో అవినాష్ కొనసాగుతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల లీడ్‌లో ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందజలో ఉన్నారు. అమాలపురం టీడీపీ అభ్యర్థి అయిత బత్తుల ముందంజలో ఉన్నారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 12 స్థానాల్లో కొనసాగుతుండగా, వైసీపీ అభ్యర్థులు 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.
-
కొనసాగుతోన్న కూటమి అభ్యర్థుల ఆధిక్యం..
ఏపీలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మధుర్ మండపేట…2700 ఓట్లు మెజారిటీతో కొనసాగుతున్నారు.
-
Pithapuram Election Result: ఆధిక్యంలో పవన్ కళ్యాణ్..
ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి 617 ఓట్లతో, రాజమండ్రి రూరల్‌లో 2870 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు.
-
కొనసాగుతోన్న బుచ్చయ్య చౌదరి ఆధిక్యం..
రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్ బుచ్చయ్య చౌదరి ఆధిక్యం కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 91 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బుచ్చయ్య చౌదరి, రెండో రౌండ్‌లో 2870 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థుల హవా..
పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థుల హవా మొదలైంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్ బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారయణ ముందజలో కొనసాగుతున్నారు. ఇక కుప్పంలో 1549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు.
-
ఏపీలో కొనసాగుతోన్న పోస్టల్ ఓట్ల లెక్కింపు.. లీడింగ్ ఎవరు ఉన్నారంటే..
ఏపీలో పోస్టల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సుమారు 4 లక్షల 61 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు వినియోగించుకున్నారు. వీరితో పాటు 80 ఏళ్లు పైబడిన వారు సుమారు 24 వేల మంది ఉన్నారు. మొత్తం మీద 5 లక్షలకుపైగా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణంగానే పోస్టల్ ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లలో లెక్కింపు చేపడుతున్నారు.
-
తొలి ట్రెండ్స్ లో ఎన్డీఏ ఆధిక్యం..
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి ట్రెండ్స్ కూడా వెలువడుతున్నాయి. ఎన్డీయేకు 6 సీట్లు, ఇండి కూటమి 2 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి..
-
మొదలైన కౌంటింగ్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 8.30 గంటల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు.
-
పోలీసులకు ఈసీ కీలక ఆదేశాలు..
విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిషేధం.
రోడ్లపై బాణాసంచా కాలిస్తే కఠిన చర్యలు.
పోలీసులకు ఈసీ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు.
చర్యలు ఉల్లంఘిస్తే బైండోవర్ కేసులు నమోదు.
-
గీత దాటితే తాట తీస్తాం.. డీజీపీ హెచ్చరికలు జారీ..
కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు.
రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఏపీ డీజీపీ.
గీత దాటితే తాటతీస్తామంటు వార్నింగ్ ఇచ్చారు. IT act కింద కేసులు రౌడీ షీట్లు ,PD ACT ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడంపై కూడా నిషేధం విధించారు.
గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్ గా ఉండాలంటు సూచించారు.
-
సెల్ ఫోన్ అనుమతి నిషేధం..
కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతించకూడదని కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.
ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు.
-
రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు.. అందుబాటులో రెండు టియర్ గ్యాస్ టీమ్స్..
కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా ఏర్పాట్లు.
రూల్స్ అతిక్రమిస్తే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు తొమ్మిది టియర్ గ్యాస్ టీమ్స్ సిద్దంగా అందుబాటులో ఉంచారు.
అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సులు, రెండు టియర్ గ్యాస్ వాహనాలు అందుబాటులో ఉంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో నేడు మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేశారు.
-
ఈ ప్రాంతాల్లో రెడ్ జోన్.. మూడంచెల పటిష్ట బందోబస్తు..
వీవీ ప్యాట్స్ లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా ఫైనల్ ఫలితాలు విడుదలవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
కౌంటింగ్ సెంటర్ల చుట్టూ 200 మీటర్లమేర రెడ్‌జోన్‌గా పరిగణించారు.
-
మొదటి ఎంపీ ఫలితం అక్కడే..
మొదట రాజమండ్రి, నరసాపురం లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఆఖరుగా అమలాపురం పార్లమెంట్ ఫలితం వెలువడనున్నట్లు తెలిపారు కౌంటింగ్ అధికారులు.
అమలాపురం స్థానంలో అత్యధికంగా 27 రౌండ్లలో లెక్కింపు ఉండనుంది.
-
తొలి, తుది ఫలితాలు అక్కడే.. ఓట్ల లెక్కింపులో ప్రత్యేక ఏర్పాట్లు..
కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొత్తం 13 రౌండ్లలోనే తుది ఫలితం వెలువడేలా ఏర్పాటు చేసిన ఈసీ. భీమిలి, పాణ్యం ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఇక్కడ 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.
-
మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలపై స్పష్టత..
ఈవీఎంల్లో నమోదైన ఓట్ల లెక్కింపుకు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు.
-
నరాలు తెగే ఉత్కంఠకు తెర.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సర్వం సిద్దం..
నరాలుతెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఉదయం 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది.
-
ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు.. గెలుపు, ఓటములపై ఉత్కంఠ..
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు ఓటముల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసీ ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Published On - Jun 04,2024 7:00 AM