AP Elections 2024 Counting: ఏపీలో ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్.. తొలి ఫలితం ఎక్కడంటే..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపు ఓటముల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసీ ముఖేష్‌ కుమార్ మీనా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నరాలుతెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్ లెక్కింపు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

AP Elections 2024 Counting: ఏపీలో ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్.. తొలి ఫలితం ఎక్కడంటే..
Counting Arrangements
Follow us
Srikar T

|

Updated on: Jun 04, 2024 | 8:07 AM

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపు ఓటముల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసీ ముఖేష్‌ కుమార్ మీనా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నరాలుతెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్ లెక్కింపు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఉదయం 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది.

పోస్టల్‌ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు రెండున్నర గంటల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈవీఎంల్లో నమోదైన ఓట్ల లెక్కింపుకు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లో కేవలం 13 రౌండ్లలోనే తుది ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. దీనికి కారణం 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

ఇక ఎంపీ స్థానాల విషయానికొస్తే.. మొదట రాజమండ్రి, నరసాపురం ఫలితాలు వెలువడనున్నాయి. ఆఖరుగా అమలాపురం ఎంపీ ఫలితం వెలువడనున్నట్లు తెలిపారు. అమలాపురం స్థానంలో అత్యధికంగా 27 రౌండ్లలో లెక్కింపు ఉండనుంది. వీవీ ప్యాట్స్‌ లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు విడుదలవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్‌ సెంటర్ల చుట్టూ రెడ్‌జోన్‌ గా పరిగణించారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ నిర్వహణ ఉండనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో 1985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..