AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: కూటమి పోలింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్.. ఈ అంశాలపై సూచనలు..

కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్టపడబోతోందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Chandrababu: కూటమి పోలింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్.. ఈ అంశాలపై సూచనలు..
Chandrababu Naidu
Srikar T
|

Updated on: Jun 03, 2024 | 8:59 PM

Share

అమరావతి, జూన్ 3: కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్టపడబోతోందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని వివరించారు.

ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్‎లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని.. నిబంధనలకు కట్టుబడి ఉండండన్నారు. ఏజెంట్లు నిర్ధేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దంటూ దిశానిర్ధేం చేశారు. ఇదిలా ఉంటే ఈమధ్య వెలువడిన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఎన్డీయే కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు, శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో కౌంటింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..