AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Litchi Farming: ఆహా లిచి..వారెవా ఏమి రుచి..! ఆంధ్ర ఊటీలో విరగ్గాస్తున్న మధుర ఫలం..

పోషకాల గని.. సర్వరోగ నివారిణి.. లిచి ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గర కూడా పండుతుంది. శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ లీచి సాగు.. ఇప్పుడు ఏజెన్సీలోనూ విరగ్గాస్తోంది. ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికే పరిమితమై నోరూరించే ఈ మధురఫలంపై ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలు చేస్తున్నారు. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి.

Litchi Farming: ఆహా లిచి..వారెవా ఏమి రుచి..! ఆంధ్ర ఊటీలో విరగ్గాస్తున్న మధుర ఫలం..
Lichi Farming
Maqdood Husain Khaja
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 06, 2024 | 4:35 PM

Share

పోషకాల గని.. సర్వరోగ నివారిణి.. లిచి ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గర కూడా పండుతుంది. శీతల ప్రాంతాలకే పరిమితమైన ఈ లీచి సాగు.. ఇప్పుడు ఏజెన్సీలోనూ విరగ్గాస్తోంది. ఇన్నాళ్లు ఉత్తర భారతదేశానికే పరిమితమై నోరూరించే ఈ మధురఫలంపై ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలు చేస్తున్నారు. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, ఆవకాడో, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరి ఏజెన్సీ చింతపల్లిలో.. ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది. చైనాలో పుట్టి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‎లో పండుతోంది.

ఫలిస్తున్న శాస్త్రవేత్తల ప్రయోగాలు..

అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనాస్థానంలో ప్రయోగాత్మకంగా నాటిన లిచ్చి పండ్లు ఇప్పుడు కాపు కొచ్చాయి. వాతావరణం అనుకూలించడంతో విరివిగా కాస్తున్నాయి. దీంతో ఏజెన్సీ రైతులు ఈ పంటపై దృష్టి సారించారు. వాస్తవానికి లీచి పళ్ళు.. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ వంటి అతిశీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతున్నాయి. అయితే.. అల్లూరి జిల్లాలో శీతల వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ప్రయోగాత్మకంగా ఈ పండ్ల మొక్కలను తీసుకొచ్చి పరిశోధనలు జరిపారు. బీహార్ నుంచి మూడు రకాల వంగడాలను తీసుకువచ్చి నాటారు. వీటిలో షాహిరకం లీచి పళ్ళు సత్ఫలితాలనుస్తూ అధిక దిగుబడులు అందుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ సాగును ప్రోత్సహిస్తున్నామని అన్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు.

విరగ్గాస్తూ..నోరూరిస్తూ..

చింతపల్లి ఉద్యాన పరిశోధనాస్థానంలో లీచి పండ్లు పండుతున్నాయి. అనుకూల వాతావరణంతో విరగ్గాస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే లీచి.. స్థానికంగా ధర కిలో రూ150వరకు పలుకుతోంది. ఈ పండు తినడం వలన గుండె, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులు ధరి చేరకుండా సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నట్టు చెబుతున్నారు. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రైతులు వాణిజ్యపరంగా ఈ సాగు చేసుకునేందుకు అనేక అవకాశాలున్నాయని సూచిస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు.

ఇవి కూడా చదవండి

Litchi

వాణిజ్య పరంగా లీచి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అనుకూలమైన వాతావరణం తోడు అధిక దిగుబడినిచ్చే లీచి మొక్కలను సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లీచి ప్రాధాన్యత తెలిసి.. ఇప్పుడు వాటిని పండించేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

Litchi Fruit

Litchi Fruits

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..