Andhra Pradesh: ‘జోక్యం చేసుకోలేం..’ పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీ నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్వర్వులపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పార్టీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Andhra Pradesh: 'జోక్యం చేసుకోలేం..' పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
Supreme Court
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 03, 2024 | 1:24 PM

పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని…. సీలు, హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను YCP సవాల్ చేసిన నేపథ్యంలో సుప్రీం నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఐతే.. వాదనల తర్వాత జోక్యానికి కోర్టు నో చెప్పింది. జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను YCP సుప్రీంలో సవాల్ చేయడంతో.. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కు తెలిపింది కోర్టు.

ఇవాళ సుప్రీంకోర్టులో YCP తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్లపై రూపొందించిన నిబంధనలను మార్చుతూ మే 30న ఈసీ సర్క్యులర్ జారీ చేసిందని, నిబంధనల్లో సడలింపు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సర్క్యులర్ ప్రకారం ఫాం 13(ఏ)పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఒక్కటే ఉంటే సరిపోతుందని పేర్కొన్నారని.. పేరు, హోదా, సీల్ కూడా అవసరం లేదని చెప్పడం సరికాదని అభ్యంతరం తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు చెప్పడం సరికాదని.. ఈ ప్రక్రియకు దోహదం చేసే అంశాల్లో పిటిషన్లను విచారణకు తీసుకోవచ్చని చెప్పారు. దీనిపై వాదనల తర్వాత జోక్యానికి సుప్రీం నిరాకరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..