AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections: ఎన్నికల ఫలితాల వేళ ఆ పోస్టులు పెట్టారో… ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్

సోషల్ మీడియా పోస్టులుపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు ఏపీ డీజీపీ. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేదమన్నారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP Elections: ఎన్నికల ఫలితాల వేళ ఆ పోస్టులు పెట్టారో... ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్
DGP Harish Kumar Gupta
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2024 | 1:41 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కౌంటింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది.  కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసిరుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు పోలీసులు.  సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులుపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేదమన్నారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి ప్రోద్భలంతో పోస్టులు పెడుతున్నారో విచారించి చర్యలు తీసుకుంటామంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే..  ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు.  అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని..  గ్రూప్ అడ్మిన్‌లు అలెర్ట్‌గా ఉండాలని డీజీపీ హరీష్‌గుప్తా హెచ్చరించారు.

కాగా మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 8.30 గంటలకి EVM కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట EVM కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందన్నారు. కాగా కౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..