అప్పటి వరకు డ్రోన్లు ఎగరవేయొద్దు.. రెచ్చగొట్టే పోస్టింగ్స్‌పై కఠినమైన ఆంక్షలు..
పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టిడిపి, వైసిపి కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పల్నాడు జిల్లా పోలింగ్ అనంతర ఘర్షణలతో వార్తల్లో నిలిచింది. దీంతో కౌంటింగ్ సమయంలో కూడా తిరిగి హింసాత్మక ఘటనలు జరగవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టిడిపి, వైసిపి కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పల్నాడు జిల్లా పోలింగ్ అనంతర ఘర్షణలతో వార్తల్లో నిలిచింది. దీంతో కౌంటింగ్ సమయంలో కూడా తిరిగి హింసాత్మక ఘటనలు జరగవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అల్లర్లు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ పల్నాడు జిల్లాలో అత్యంత్య పకడ్భందిగా చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నర్సరావుపేట పార్లమెంట్ కౌంటింగ్ జేఎన్టీయు కాలేజ్‌లో జరగనున్నాయి. దీంతో కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేతపై నిషేధం విధించారు. అదే విధంగా కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. అనుమతి లేని వాహనాలు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలోని అన్ని ముఖ్య నియోజకవర్గ కేంద్రాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలు కారణంగా పల్నాడు జిల్లా పరువు పోయిందని తిరిగి ఘర్షణలు జరగకుండా ప్రజలు సహకరించాలని ఎస్పీ మల్లికా గార్గ్ పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు జరిగిన గొడవల్లో పాల్గొన్న 1600 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారిలో 1300 మందిని అరెస్ట్ చేశారు. 400మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. వందలాది మందిని బైండోవర్ చేశారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పోలీసులు మోహరించారు. ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రంలో షాపులు మూసివేయిస్తున్నారు. రెండు రోజుల పాటు షాపులు మూసి వేయాలంటున్నారు. 144 సెక్షన్ తో పాటు పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..