- Telugu News Photo Gallery Gandharva Mahal, built by Zamindari clans in Eluru, has completes 100 years
100 ఏళ్లనాటి పురాతన గంధర్వ మహల్.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. చూస్తే స్టన్..
ఓ జమీందారు కలల సౌధం ఆ గంధర్వమహల్ నిర్మాణం. పల్లెటూరులో కళ్ళు చెందిరే డిజైన్లు, విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయిన్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్. రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలస్ నిర్మించాలన్న సంకల్పించారు.
Updated on: Jun 03, 2024 | 4:28 PM

ఓ జమీందారు కలల సౌధం ఆ గంధర్వమహల్ నిర్మాణం. పల్లెటూరులో కళ్ళు చెందిరే డిజైన్లు, విదేశీ వస్తువులతో మహల్ నిర్మాణం నేటికీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయిన్పటికీ చెక్కు చెదరని భవంతిగా చరిత్రకెక్కింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో నిర్మించిన గంధర్వ మహల్.

రాజస్థాన్ విహార యాత్రకు వెళ్లిన ఆ యువ జమీందారుకు తన స్వగ్రామంలో అందమైన ప్యాలస్ నిర్మించాలన్న కోరికతో1918లో గంధర్వ మహల్ నిర్మాణం మొదలుపెడితే 1924 లో పూర్తి అయ్యింది. గొడవర్తి నాగేశ్వరావు చౌదరీ అనే జమీందారు ఆచంట గ్రామంలో ఈ మహల్ నిర్మించారు.

గంధర్వమహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగు సున్నంలో కోడిగుడ్ల సొనా కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారు. అందుకే ఇప్పటికీ మహల్ గోడలు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. కలప బర్మా నుండి, ఇనుప దిమ్మలు లండన్ నుండి ఓడల్లో చెన్నైకి వచ్చాయట. అక్కడ నుండి ఆచంట గోదావరి తీరానికి పడవలులో జల రవాణా ద్వారా తెప్పించారు.

గంధర్వ మహల్ నిర్మాణం పూర్తిన సమయంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో విదేశాలు నుండి జనరేటర్లు తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీప కాంతులలో మెరిసిపోయేలా చేశారట జమీందార్లు. అప్పట్లో ఈ మహల్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. అంతేకాదు మహల్ సెంట్రల్ హాల్లో కనిపించే పియానో లండన్ నుండి తీసుకువచ్చారు.

1885లో లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ పియానోకు రజిత పతకం గెలవడం విశేషం. ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించడం విశేషం. మహల్హాలులో ఇరువైపులా బిల్జియం నుండి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు. వీటి విశేషం ఏమిటంటే ఈ అద్దం ఎదురుగా నుంచుని చూస్తే ఏడు ప్రతిబింబాలు ఒకదాని ప్రక్కన మరోకటి నిల్చున్నట్లు కనబడుతుంది.

ఈ గంధర్వ మహల్లో నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టి రామారావు, నారా చంద్రబాబు నాయుడులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మహల్లోనే బస చేసేవారు. నేటితో ఈ గంధర్వ మహల్ నిర్మించి 100 సంవత్సరాలు పూర్తవ్వడంతో గంధర్వమహల్ నిర్మించిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్ళు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిశ్చయించుకున్నారు.
