AP Elections: ‘కచ్చితంగా ఆ పార్టీదే అధికారం’.. ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద జోస్యం..
టిక్.. టాక్.. టిక్.. టాక్.. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా.? లేక అనూహ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా.? అనే ఉత్కంఠ.. ఇలా ఉన్నాయి..
టిక్.. టాక్.. టిక్.. టాక్.. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా.? లేక అనూహ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా.? అనే ఉత్కంఠ ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఉంది. అయితే ఇరు పార్టీలకు విజయం అంత ఈజీ కాదని ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్పేశాయి. కొన్ని సర్వేలు వైసీపీకి పట్టం కడితే.. మరికొన్ని సర్వే సంస్థలు కూటమికి ఓటేశాయి. ఈ నేపధ్యంలో జూన్ 4న ఫలితాలు ఎట్లా వస్తాయని అందరిలోనూ టెన్షన్ పీక్స్‌కి చేరింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..
ఏపీలో రెండోసారి సీఎం పదవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడటారని జోస్యం చెప్పారు పరిపూర్ణానంద స్వామిజీ. అటు దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. తనకు ఓ ముఖ్యమైన వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం మేరకు చెబుతున్నానని.. ఏపీలో వైసీపీ 123 స్థానాలు సాధిస్తుందన్నారు. అటు హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతున్నారని పరిపూర్ణానంద స్వామిజీ జోస్యం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు.. వైసీపీ వైపు మొగ్గు చూపారని.. ఆ పార్టీకి వచ్చిన అధిక శాతం ఓట్లు వారి నుంచేనని పేర్కొన్నారు.
ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..