హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌ ఉందా? ఈ ప్రాంతం మరో కోకాపేట కావడం పక్కా! కోటీశ్వరులయ్యే ఛాన్స్..

సొంత ఇల్లు.. ప్రతీ ఒక్క సామాన్యుడి కల ఇది. ఎప్పటికైనా సరే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటుంటారు. దీనికోసం గట్టిగా పరిశోధన చేస్తారు. ఏ ప్రాంతంలో తక్కువ ధరకు లభిస్తుంది.? ఆ ప్రాంతం నివాసయోగ్యమైనదేనా.? ఎక్కడ కొనుగోలు చేస్తే.. మన భవిష్యత్తుకు భరోసాగా ఉంటుంది.?

హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌ ఉందా? ఈ ప్రాంతం మరో కోకాపేట కావడం పక్కా! కోటీశ్వరులయ్యే ఛాన్స్..
Hyderabad Real Estate
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2024 | 11:11 AM

సొంత ఇల్లు.. ప్రతీ ఒక్క సామాన్యుడి కల ఇది. ఎప్పటికైనా సరే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటుంటారు. దీనికోసం గట్టిగా పరిశోధన చేస్తారు. ఏ ప్రాంతంలో తక్కువ ధరకు లభిస్తుంది.? ఆ ప్రాంతం నివాసయోగ్యమైనదేనా.? ఎక్కడ కొనుగోలు చేస్తే.. మన భవిష్యత్తుకు భరోసాగా ఉంటుంది.? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ.. ఇంటి కోసం అన్వేషిస్తుంటారు కొందరు జనాలు. ఇక వారి కోసం ఓ అద్దిరిపోయే న్యూస్. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ‘బూమ్.. బూమ్’ అంటోంది. మరో మాదాపూర్, హైటెక్ సిటీ.. అలాగే కోకాపేట, మణికొండ మాదిరిగా ఈ ప్రాంతం మిమ్మల్ని భవిష్యత్తు కోటీశ్వరులను చేస్తుంది. రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడీ ప్రాంతం కొత్త డెస్టినేషన్ అని చెప్పొచ్చు.

కొన్నేళ్ల విషయం పక్కనపెడితే.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సెంట్ భూమి కొనాలంటేనే సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. కోకాపేటలో ఒక్క చదరపు అడుగు రూ. 15 వేలు పలుకుతోంది. అంటే 1000 చదరపు గజాలు కొనాలంటే.. కచ్చితంగా రూ. కోటి యాబై లక్షలు పెట్టాల్సిందే. ఇక మణికొండ విషయానికొస్తే.. ఇక్కడ ఒక్కో చదరపు అడుగు రూ. 12,650గా ఉంది. దీన్ని బట్టి చూస్తే 1000 చదరపు అడుగులు కొనడానికి కోటి 30 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే మీరు ఈ డబ్బుతో పాటు మరో రూ. 30 లక్షలు పెడితే.. ఫ్యూచర్ మణికొండ, కోకాపేటలో ఎక్కువ స్థలం కొనేయొచ్చు. ఈ విషయం మేము కాదండీ.. స్వయంగా రియల్ ఎస్టేట్ నిపుణులే చెబుతున్నారు.

ఇది చదవండి: SRH‌కి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..

ఇవి కూడా చదవండి

మెట్రో ఫేజ్-2 విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న అన్ని ఏరియాలు అభివృద్ధి చెందుతాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌లోని మిగతా ఏరియాలకు మెట్రోను విస్తరించే పనిలో పడింది రేవంత్ సర్కార్. ఈ నేపధ్యంలోనే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలు డెవలప్ కానున్నాయి. ఘట్‌కేసర్, శంషాబాద్, తుక్కుగూడ, కొల్లూరు, నార్సింగి, శామీర్ పేట్, మేడ్చల్ సహా పలు ఏరియాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్ వస్తే.. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో కొన్ని గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తాయి. అటు మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, చింతల్‌పల్లి, ఇరిగిపల్లె, శివంపేట్, లింగోజిగూడ, కొత్తపేట సహా ఇంకొన్ని గ్రామాలు రీజనల్ రింగ్ రోడ్డులోకి వస్తాయి.

ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?

మరోవైపు హైవేల పక్కన ఏరియాల ధర ఎలా ఉందంటే.. శ్రీశైలం హైవేలో చదరపు అడుగు రూ. 1300, వరంగల్ హైవేలో చదరపు అడుగు రూ. 1400, బెంగళూరు హైవేలో చదరపు అడుగు రూ. 1600గా ఉన్నాయి. ఇలా ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య వచ్చే ఏరియాల్లో మీరు పెట్టుబడి పెడితే.. ఫ్యూచర్‌లో భారీ లాభాలు పొందొచ్చు. కాగా, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియాలు ఫ్యూచర్‌లో డెవలప్ అయితే.. అప్పుడు చదరపు అడుగు ఒక్కొక్కటి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పలుకుతుంది. ఉదాహరణకు ఇప్పుడు గజం 10 వేలు చొప్పున 100 గజాలు 10 లక్షలకు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో అది గజం రూ. 50 వేలు అయితే, సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది