అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీ

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీపడుతున్నాయి. నిన్నటి వరకు కారు చవకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజారులోనే కిలో రూ. 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో అయితే, రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. బీన్స్ అయితే రూ. 200 దాటేసింది. బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి.

అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీ

|

Updated on: May 31, 2024 | 1:19 PM

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీపడుతున్నాయి. నిన్నటి వరకు కారు చవకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజారులోనే కిలో రూ. 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో అయితే, రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. బీన్స్ అయితే రూ. 200 దాటేసింది. బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి. రైతు బజార్లలో గుండుబీన్స్ కిలో రూ. 155 లు, గింజ చిక్కుడు రూ. 85, పచ్చకాకర రూ. 55, బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 50 లు పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర చిన్నకట్ట పది రూపాయలకు విక్రయిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ. 2800 టన్నులకు అటూఇటుగా వస్తున్నాయి. మామూలుగా అయితే నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయాలు అవసరం. ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లోకి కుక్క వస్తే..100 డయిల్ చేశాడు.. మరి పోలీసుల రియాక్షనేంటి ??

అప్పుడు టైటాన్.. ఇప్పుడు ట్రిటాన్.. టైటానిక్ కోసం సాహసయాత్ర

పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

TOP 9 ET News: వెర్రి చేష్టలు కావాలనే బుక్ చేశారు! | 12 దేశాల్లో రికార్డ్‌ క్రియేట్ చేసిన పుష్ప సాంగ్

భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు

Follow us
Latest Articles