అప్పుడు టైటాన్.. ఇప్పుడు ట్రిటాన్.. టైటానిక్ కోసం సాహసయాత్ర
సాహసం. ఇది ఊరికే ఉండనివ్వదు. ఇతరులు చేయలేనిది తాము చేయాలని.. తమకు ధైర్యం ఎక్కువ అని చాటి చెప్పాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇలాంటి వారివల్లే సరికొత్త సంగతులు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పచ్చు. సముద్రపు అట్టడుగు నుంచి.. అంతరిక్షం వరకు దేని గురించి అయినా సరే.. అన్వేషణ సాగించడం వీరి నైజం. అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూడడానికి.. కిందటేడాది టైటాన్ సబ్ మెరైన్ లో కొంతమంది సాహసికులు వెళ్లారు.
సాహసం. ఇది ఊరికే ఉండనివ్వదు. ఇతరులు చేయలేనిది తాము చేయాలని.. తమకు ధైర్యం ఎక్కువ అని చాటి చెప్పాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇలాంటి వారివల్లే సరికొత్త సంగతులు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పచ్చు. సముద్రపు అట్టడుగు నుంచి.. అంతరిక్షం వరకు దేని గురించి అయినా సరే.. అన్వేషణ సాగించడం వీరి నైజం. అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూడడానికి.. కిందటేడాది టైటాన్ సబ్ మెరైన్ లో కొంతమంది సాహసికులు వెళ్లారు. తమ లక్ష్యాన్ని చేరుకోగలమని.. తాము అనుకున్నది సాధించగలమని.. బయలుదేరేముందు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ వారి కలలు సాకారం కాలేదు. వారు ప్రయాణించిన టైటాన్ సబ్ మెరైన్ దురదృష్టవశాత్తూ పేలిపోయింది. ఈ వార్త ప్రపంచాన్ని షాక్ కు గురయ్యేలా చేసింది. టైటానిక్ గురించి సమాజానికి తెలియజేస్తారనుకుంటే.. తమ ప్రాణాలనే కోల్పోయారు. ఇంకా ఆ విషాద ఘటన చేదు జ్ఞాపకాలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. కానీ ఇంతలోనే.. టైటాన్ సబ్ మెరైన్ వెళ్లినట్టే.. ట్రిటాన్ సబ్ మెరైన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు.. టైటానిక్ షిప్ శకలాలను చూడడానికి రెడీ అయ్యారు. వారిలో ఒకరు లారీ కానర్, మరొకరు పాట్రిక్ లాహే. ఇప్పుడు చెప్పుకున్న ఇద్దరు సాహసికుల గురించి చూస్తే.. లారీ కానర్ అమెరికన్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ వ్యాపారవేత్త అని చెప్పచ్చు. అతను నాసా సర్టిఫై చేసిన ఒక ప్రైవేట్ ఆస్ట్రోనాట్. లారీ.. 2021లో అంతరిక్ష యాత్రలో పార్టిసిపేట్ చేశాడు. 17 రోజుల, ఒక గంటా 48 నిమిషాల పాటు స్పేస్ లో గడిపాడు. పాట్రిక్ లాహే సంగతి చూస్తే.. ట్రిటాన్ సబ్ మెరైన్స్ కో ఫౌండర్. పాట్రిక్ లాహేకు చెందిన కంపెనీ.. ట్రిటాన్ జలాంతర్గాముల మాన్యుఫ్యాక్టరింగ్ ఫెసిలిటీస్ ని ఫ్లోరిడా, బార్సిలోనా, స్పెయిన్ లో అందిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా
భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్ పెట్టిన కంగనా
క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేస్తామంటూ.. బ్యాంక్ అకౌంట్ లూఠీ
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

