పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

బియ్యం గింజలు, అగ్గిపుల్లలపై తయారుచేసిన సూక్ష్మ కళాఖండాలను ఇప్పటివరకు మనం చూశాం.. అయితే ఇప్పుడు అదే తరహాలో ఓ యువతి పెన్సిల్ చివర ఉండే కార్బన్ లెడ్లపై పలువురు జీవిత చరిత్రలు రాసి అందరి మన్ననలు పొందుతోంది. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై లిఖించి అమ్మవారికి సమర్పించింది. మే 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు పలు ఆలయాలలో ఘనంగా నిర్వహించారు.

పెన్సిల్ లెడ్ పై జీవితచరిత్ర.. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

|

Updated on: May 31, 2024 | 1:16 PM

బియ్యం గింజలు, అగ్గిపుల్లలపై తయారుచేసిన సూక్ష్మ కళాఖండాలను ఇప్పటివరకు మనం చూశాం.. అయితే ఇప్పుడు అదే తరహాలో ఓ యువతి పెన్సిల్ చివర ఉండే కార్బన్ లెడ్లపై పలువురు జీవిత చరిత్రలు రాసి అందరి మన్ననలు పొందుతోంది. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై లిఖించి అమ్మవారికి సమర్పించింది. మే 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పుట్టినరోజు వేడుకలు పలు ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత శ్రీ వాసవి మాత జీవిత చరిత్రను ఇంగ్లీషులో పెన్సిల్ లెడ్లపై రాసింది. జీవిత చరిత్ర రాసిన చిత్రపటాన్ని ఒంగోలులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించింది. చిన్నతనం నుంచి మహితకు మైక్రో ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దాతో చిన్నప్పటి నుంచే పెన్సిల్ చివర ఉన్న కార్బన్ లెడ్లపై ప్రత్యేకంగా పలువురి జీవిత చరిత్రలు రాయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్రను రాయాలని ఆలోచన చేసింది. మే 18న అమ్మవారి జన్మదినం సందర్భంగా ఐదు రోజులు కష్టపడి పెన్సిల్ లెడ్లపై అతి సూక్ష్మ రూపంలో ఇంగ్లీషులో అమ్మవారి జీవిత చరిత్రను రాసి చిత్ర పటాన్ని తయారు చేసింది. ఆ చిత్రపటాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వెర్రి చేష్టలు కావాలనే బుక్ చేశారు! | 12 దేశాల్లో రికార్డ్‌ క్రియేట్ చేసిన పుష్ప సాంగ్

భానుడి భగభగలు.. ట్రాన్స్‌ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు

Kangana Ranaut: గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ చేసుకున్న బ్యూటీ ?? రూమర్లకు చెక్‌ పెట్టిన కంగనా

క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేట్‌ చేస్తామంటూ.. బ్యాంక్‌ అకౌంట్‌ లూఠీ

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్‌ హెచ్చరిక

Follow us