కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్ హెచ్చరిక
కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు.
కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపు నిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. తగిన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్ డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని పేర్కొన్నారు. 2021లో కరోనా సందర్భంగా తాను చేసిన సూచనలన్నీ 2023 కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. సైనిక అవసరాల విషయంలో ఎంతటి అప్రమత్తంగా ఉంటామో సంక్షోభ కట్టడి చర్యలకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలన్నారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

