మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

సముద్రమట్టం నుంచి దాదాపు 8.5 కిలోమీటర్ల ఎత్తు! ఎటుచూసినా దట్టంగా పరుచుకున్న మంచు.. ఎముకలు కొరికే చలి.. ప్రచడ వేగంతో వీచే అతిశీతల గాలులు.. నిరంతరం పొంచి ఉండే ప్రాణాపాయం. ఇవీ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకోవాలంటే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు. అయితేనేం.. పర్వతారోహకులు వెనక్కి తగ్గట్లేదు. కాస్త అనుకూల వాతావరణం లభించగానే ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు పోటెత్తుతున్నారు.

మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Updated on: May 31, 2024 | 1:08 PM

సముద్రమట్టం నుంచి దాదాపు 8.5 కిలోమీటర్ల ఎత్తు! ఎటుచూసినా దట్టంగా పరుచుకున్న మంచు.. ఎముకలు కొరికే చలి.. ప్రచడ వేగంతో వీచే అతిశీతల గాలులు.. నిరంతరం పొంచి ఉండే ప్రాణాపాయం. ఇవీ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకోవాలంటే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు. అయితేనేం.. పర్వతారోహకులు వెనక్కి తగ్గట్లేదు. కాస్త అనుకూల వాతావరణం లభించగానే ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో అక్కడ విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు మే 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మే 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదు. ఇది ఎంతో కష్టతరమైన విషయం అని అందులో పేర్కొన్నాడు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ ను అధిరోహించగలరని పేర్కొన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: రష్మికాకు స్పాట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో

ఆమె నా కూతురు కాదు.. అందరికీ షాకిచ్చిన ఒకప్పటి హీరోయిన్

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

Follow us