Ravi Kiran
30 May 2024
సుదూర ప్రయాణ సౌకర్యాన్ని, వేగాన్ని గణనీయంగా పెంచడానికి ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు సహాయపడతాయి. ఈ కొత్త రైళ్లపై జూలై నెలలో ట్రయిల్ రన్ చేసి.. ఆ తర్వాత పట్టాలెక్కించనున్నారట.
ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. సికింద్రాబాద్ టూ పూణే మధ్య ఈ సర్వీసును ప్రవేశపెట్టాలని భారత రైల్వే యోచిస్తోందట.
ఈ స్లీపర్ రైళ్ల ప్రతి కోచ్‌లో ఇంటర్-కమ్యూనికేటివ్ ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సౌండ్‌ఫ్రూఫింగ్, సెన్సార్ ఆధారిత లైటింగ్, చిన్న ప్యాంట్రీలతో సహా ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. అలాగే వికలాంగులకు అనుకూలమైన బెర్త్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
వందే భారత్ రైళ్లు తమ సెమీ-హై-స్పీడ్ రైలు సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి భారతీయ రైల్వే చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి.
సికింద్రాబాద్-పూణే మధ్య ప్రవేశపేట్టే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను భర్తీ చేయనుందట. ఈ రెండు నగరాలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సుమారు 8 గంటల 25 నిమిషాలలో కవర్ చేస్తోంది.
ఒకవేళ వందే స్లీపర్ ట్రైన్లు అమలులోకి వస్తే.. ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు కనీసం గంట ముందుగా చేరుకుంటారు.
ప్రస్తుతం, ఐదు వందే భారత్ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్
కాచిగూడ - యశ్వంతపూర్, విజయవాడ - చెన్నై సెంట్రల్. ఈ రైళ్లు 100 శాతానికి పైగా ప్రజా ఆదరణతో విజయవంతంగా నడుస్తున్నాయి.