ఫస్ట్‌నైట్ రోజున వధువుకు విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా కళ్లు తేలేసిన వరుడు.!

పెళ్లయిన రెండు రోజులకే ఓ యువతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని వరుడి కుటుంబం దెబ్బకు షాక్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధామ్‌నోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గ్రామంలో చోటు చేసుకుంది. సదరు యువతిని ప్రసవం గురించి అత్తమామలు ప్రశ్నించగా

ఫస్ట్‌నైట్ రోజున వధువుకు విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా కళ్లు తేలేసిన వరుడు.!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: May 30, 2024 | 1:18 PM

పెళ్లయిన రెండు రోజులకే ఓ యువతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని వరుడి కుటుంబం దెబ్బకు షాక్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధామ్‌నోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గ్రామంలో చోటు చేసుకుంది. సదరు యువతిని ప్రసవం గురించి అత్తమామలు ప్రశ్నించగా, తనకు పరిచయస్తుడైన ఒకడు పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేసి మోసం చేశాడని చెప్పుకొచ్చింది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడు సరాయ్ గ్రామానికి చెందిన సునీల్ బాఘెల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

ధామనోడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువతికి మే 20న వివాహం అయితే.. రెండు రోజుల తర్వాత మే 22 తెల్లవారుజామున ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె భర్త వెంటనే ఆమెను ధామ్‌నోడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా, ఆమె నిండు గర్భిణి అని వైద్యులు వెల్లడించారు. షాక్ తిన్న వరుడి కుటుంబీకులు యువతిని ప్రశ్నించారు. నెలల తరబడి దాచిపెట్టిన అత్యాచారం, మోసం అనే భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది.

ఇది చదవండి: కడప టూ బెంగళూరు.. ఇకపై 6 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో.!

ఇవి కూడా చదవండి

రెండేళ్ల క్రితం సిమ్రాలి గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో సునీల్‌ అనే వ్యక్తిని కలిశానని వివరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకోవడం.. క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేసుకోవడం జరిగింది. సునీల్ చాలాసార్లు ఆమెను కలిసేవాడట. సుమారు తొమ్మిది నెలల క్రితం, పెళ్లి పేరుతో సదరు యువతిని పొలంలోకి తీసుకెళ్ళి.. ఆమెపై అత్యాచారం చేశాడు. అతడి బెదిరింపులకు భయపడిన యువతి ఈ నిజాన్ని కుటుంబం నుంచి దాచిపెట్టింది. తాను గర్భవతినని సునీల్‌కు పలుమార్లు చెప్పినా.. అతడు పట్టించుకోకుండా.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కాగా, ఈ విషయం బయటికి రావడంతో యువతి కుటుంబసభ్యులు సునీల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సునీల్‌పై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇది చదవండి:  మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో ‘B’ అక్షరాన్ని కనిపెట్టండి.!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..?
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!