Siddipet: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఈ మధ్యకాలంలో పురాతన నాణేలు బయటపడుతుండటం సర్వసాధారణమైపోయింది. పూర్వకాలం ఇళ్లు కూల్చుతుండగానో.. లేక పొలంలో తవ్వకాలు జరుపుతుండగానో.. ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కోవకు చెందిన.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ మధ్యకాలంలో పురాతన నాణేలు బయటపడుతుండటం సర్వసాధారణమైపోయింది. పూర్వకాలం ఇళ్లు కూల్చుతుండగానో.. లేక పొలంలో తవ్వకాలు జరుపుతుండగానో.. ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కోవకు చెందిన ఓ ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి అనే వ్యక్తి పొలంలో కూలీలు పనులు చేస్తుండగా.. ఆ పొలానికి ఉన్న గట్టును సన్నగా చేయాలని సంకల్పించారు.
ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?
వారంతా కలిసి ఆ పొలంలో గడ్డపారతో తవ్వుతుండగా.. ఓ రాతి డబ్బా కనిపించింది. అందులో ఏమున్నాయో అని తెరిచి చూడగా.. పురాతన వెండి నాణేలు, ఉంగరాలు దొరికాయి. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌కు సమాచారాన్ని ఇచ్చారు. ఆ రాతి డబ్బాలో 20 వెండి నాణేలు, 2 వెండి ఉంగరాలు ఉన్నాయి. వాటి బరువు సుమారు 238 గ్రాములుగా ఉంది. ఇక ఆ నాణేలపై పర్షియన్ భాష రాసి ఉంది. ఆర్కియాలజీ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ నాణేలు అసఫ్‌జాహీల కాలంనాటివిగా అంచనా వేస్తున్నారు. ఇక పురాతన నాణేలు దొరికాయని స్థానికంగా తెలియడంతో.. వాటిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా ఎగబడ్డారు.
ఇది చదవండి: SRHకి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..