TS Inter Supply Exams 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా.. కారణం ఇదే!
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షల నిర్వహణ పూర్తికాగా మరో రెండు రోజుల పాటు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్లు పరీక్షలు ఉన్నాయి. ఇక జూన్ 3న మోడ్రన్ లాంగ్వేజ్..

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షల నిర్వహణ పూర్తికాగా మరో రెండు రోజుల పాటు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్లు పరీక్షలు ఉన్నాయి. ఇక జూన్ 3న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్లు, జియోగ్రఫీ పేపర్లు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రెండు పూటలా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల అనంతరం జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 10వ తేదీన ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 11న జరుగుతుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12న జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను జూన్ 1 నుంచి 5వ తేదీకి వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్చిన తేదీల ప్రకారం తొలి విడత జూన్ 5 నుంచి, రెండో విడత జూన్ 7వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణాల వల్ల మూల్యాంకన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్, మూల్యాంకనం చేపట్టిన అధ్యాపకులకు ఇంత వరకు ప్రభుత్వం గౌరవ వేతనాలు చెల్లించలేదు. వాటిని వెంటనే విడుదల చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు.
జూన్ 3 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ల్యాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు జరగనున్నాయి.