AP ICET 2024 Toppers List: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఎన్టీఆర్ జిల్లా కుర్రోడి సత్తా
ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2024 ఫలితాలు గురువారం (మే 30) విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 44,447 మంది విద్యార్ధులు ఐసెట్ పరీక్షకు హాజరు కాగా.. వీటిల్లో 42,984 మంది అంటే 96.71 శాతం మంది..

అనంతపురం, మే 30: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2024 ఫలితాలు గురువారం (మే 30) విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 44,447 మంది విద్యార్ధులు ఐసెట్ పరీక్షకు హాజరు కాగా.. వీటిల్లో 42,984 మంది అంటే 96.71 శాతం మంది అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఏపీ ఐసెట్ పరీక్షను మే 6వ తేదీన ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఏపీ ఐసెట్ 2024లో సత్తాచాటిన ఎన్టీఆర్ జిల్లా కుర్రాడు
ఈ రోజు విడుదలైన ఐసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ క్రాంతికుమార్ 176.81 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గున్నం సాయి కార్తిక్ రెండో ర్యాంకు, విశాఖపట్నంకు చెందిన సూరిశెట్టి వసంతలక్ష్మి మూడో ర్యాంకు సాధించారు. ఆతర్వాత వరుసగా పది వరకు ర్యాంకులు సాధించిన వారిలో.. అనంతపురంకు చెందిన కడపన గణేష్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంకు, విజయనగరంకు చెందిన సామిరెడ్డి తరుణ్ కుమార్ ఐదో ర్యాంకు, తూర్పుగోదావరికి చెందిన ఎస్. దశరథరామరెడ్డి ఆరో ర్యాంకు, శ్రీకాకుళంకు చెందిన కొర్లం శ్రీకుమార్ ఏడో ర్యాంకు, తూర్పుగోదావరికి చెందిన పుచ్చా అనుపమ ఎనిమిదో ర్యాంకు, అనంతపురంకు చెందిన దవనబోయన వెంకటేశ్ తొమ్మిదో ర్యాంకు, చిత్తూరు జిల్లాకు చెందిన దొరై మునిశేషాద్రి గిరీష్ సాయి పదో ర్యాంకు సాధించారు.
ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్ధులు ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.