Election Results: తస్మాత్ జాగ్రత్త.. ఎలక్షన్ రిజల్స్ పేరుతో సరికొత్త మోసం.. పూర్తివివరాలు..
వేగంగా ఫలితాలు తెలుసుకునేందుకు తమ మొబైల్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ అంశంలో మొబైల్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సీసీఎస్ పోలీసులు. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి.
వేగంగా ఫలితాలు తెలుసుకునేందుకు తమ మొబైల్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ అంశంలో మొబైల్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సీసీఎస్ పోలీసులు. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు తెలుసుకునేందుకు చాలామంది వెబ్‌సైట్లనే ఫాలో అవుతుంటారు. వేగంగా ఫలితాలు తెలుసుకునేందుకు తమ మొబైల్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ అంశంలో మొబైల్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు, పోలీసులు. ఇప్పటికే అనేక మార్గాల్లో మొబైల్ యూజర్ల నుంచి వారి బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ తెలుసుకుని డబ్బులు కాజేస్తున్న సైబర్ మోసగాళ్లు.
తాజాగా ఎలక్షన్ రిజల్ట్స్ అంశంపై కన్నేశారు. ఇదే అదనుగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ వేళ మరో భారీ మోసానికి కేటుగాళ్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల రిజల్ట్స్ సైబర్ మోసగాళ్లు.. మొబైల్ వినియోగదారులకు అనేక లింక్స్ పంపిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో చాలా వరకు ఫేక్ ఉంటాయి. వీటి గురించి తెలియక ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలనే ఆసక్తితో పొరపాటున ఆ లింక్స్ ఓపెన్ చేస్తే ఆ తరువాత నష్టం భారీగానే ఉండొచ్చు. జనం నుంచి డబ్బులు కాజేసేందుకు ఇలాంటి ఫేక్స్ లింక్స్‌ను పంపుతున్నారు కేటుగాళ్లు. ఇలాంటి లింక్స్‌ను ఎవరూ ఓపెన్ చేయవద్దని నిపుణులతో పాటు సీసీఎస్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. పొరపాటు ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ డిటైల్స్ సైబర్ నేరగాళ్లకి వెళతాయని హెచ్చరిస్తున్నారు. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు మాయమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త పనికిరాదని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..