AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. గుట్టలు గుట్టల నోట్ల కట్టలు! లెక్కలు తేల్చిన అధికారులు

తెలంగాణలో 17 లోక్‌స‌భ స్థానాలకు మే 13న ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాదాపు రూ.200 కోట్ల విలువైన నగదు, లిక్కర్‌, బంగారాభరణాలు, నార్కొటిక్‌ డ్రగ్స్ సీజ్‌ చేసినట్లు తెలంగాణ ఎన్నికల అధికారులు సోమవారం (జూన్‌ 3) విడుదల చేసిన మీడియా నివేదికలో వెల్లడించారు..

Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. గుట్టలు గుట్టల నోట్ల కట్టలు! లెక్కలు తేల్చిన అధికారులు
Lok Sabha Elections
Srilakshmi C
|

Updated on: Jun 03, 2024 | 6:45 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 3: తెలంగాణలో 17 లోక్‌స‌భ స్థానాలకు మే 13న ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాదాపు రూ.200 కోట్ల విలువైన నగదు, లిక్కర్‌, బంగారాభరణాలు, నార్కొటిక్‌ డ్రగ్స్ సీజ్‌ చేసినట్లు తెలంగాణ ఎన్నికల అధికారులు సోమవారం (జూన్‌ 3) విడుదల చేసిన మీడియా నివేదికలో వెల్లడించారు. వీటిని మార్చి 16 నుంచి జూన్ 3వ తేదీ మధ్యలో పోలీసులు సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నిక‌ల కోడ్ జూన్‌ 6వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది.

రూ. 99.16 కోట్ల న‌గ‌దు, రూ. 11.48 కోట్ల విలువ చేసే మ‌ద్యం, రూ. 14.52 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్, రూ. 63.19 కోట్ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు, రూ. 11.91 కోట్ల విలువ చేసే ఇత‌ర వ‌స్తువుల‌ను సీజ్ చేసినట్లు ప్రెస్‌ నోట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా 2024 లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్ల 27 లక్షల 60 వేల విలువైన తాయిళాలు పట్టుబడ్డాయి. వీటిల్లో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ అధికారులు రూ.50.73 కోట్లు సీజ్‌ చేయగా.. రాష్ట్ర పోలీసులు రూ.149.54 కోట్లు సీజ్‌ చేశారు. అలాగే 7,272 అక్రమ ఆయుధాలు, 20 లైసెన్స్‌ ఉన్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 46.3 కోట్ల విలువ చేసే న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాలు, మ‌ద్యం పోలీసులు సీజ్ చేయగా.. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు మూడింత‌లు పెరిగింది. పొలిటికల్‌ లీడర్లు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టడానికి కాసులు రాల్చడం, మద్యం ఏరులై పారేలా చేయడం షరా మామూలే. అయితే ఈసారి అదికాస్త సృతి మించిందనే చెప్పాలి. ఇకపోతే మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రానికి నేతల తలరాతలు మార్చే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.