Pawan Kalyan: వైసీపీ మంత్రులు హద్దులు దాటారు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: పవన్ కల్యాణ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు - ఏపీ మంత్రుల మధ్య జరిగిన మాటల తూటాలపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోయారని జనసేన చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు – ఏపీ మంత్రుల మధ్య జరిగిన మాటల తూటాలపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోయారని జనసేన చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాలకులు వేరు.. ప్రజలు వేరు. నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదు. ఇది తెలంగాణ నాయకులు, ఏపీ మంత్రులకు కూడా వర్తిస్తుంది. మంత్రి హరీశ్ రావు ఏ సందర్భంలో ఏపీపై మాట్లాడోగారో కానీ.. ఆ తర్వాత వైసీపీ మంత్రలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. హరీశ్ రావు వ్యాఖ్యలు బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలి. అంతేకానీ తెలంగాణ ప్రజలను తిట్టడం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడడం నాకు మనస్థాపం కలిగించింది’
‘ ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి. అలాగే ఈ పరిణామాలపై వైసీపీ సీనియర్లు స్పందించాలి. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి. బొత్సా లాంటి నాయకులు మొన్నటి వరకు తెలంగాణలో కేబుల్ బిజినెస్‌లు చేశారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ వివాదాల్లోకి ప్రజలను లాగద్దు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీనేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని పవన్ డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ వీడియో..
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..