Lakshminarayana: విశాఖపట్నం నుంచే పోటీ చేస్తా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.. ఓ వైపు వైసీపీ.. మరో వైపు టీడీపీ, జనసేన పోటాపోటీ వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి.. ఓ వైపు వైసీపీ.. మరో వైపు టీడీపీ, జనసేన పోటాపోటీ వ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానంటూ క్లారిటీ.. ఇచ్చారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ.. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల్లోనే ఉన్ననని పేర్కొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. అవసరమైతే విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి చేస్తానని వివరించారు. 1980వ సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణ చేపట్టిన పైసా ఉద్యమం స్ఫూర్తితో.. ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ.100 ఇస్తే రూ.850 కోట్లు సమకూరుతాయని.. అందుకే బిడ్ వేసినట్లు తెలిపారు. ఇలా 4 నెలల పాటు నిధులు సేకరిస్తే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవచ్చంటూ వివరించారు.
కాగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేసిన లక్ష్మీనారాయణ.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ర్యాలీలో సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు. అయితే, తాజాగా.. లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..