Pawan Kalyan: మరోసారి ఇప్పటం గ్రామానికి జనసేనాని.. ఈనెల 27న బాధితులకు స్వయంగా ఆర్ధిక సాయం అందజేత

గత కొన్ని రోజులుగా రాజకీయాలకు వేదికగా ఇప్పటం గ్రామం వార్తల్లో నిలుస్తోంది. ఎన్నికల కంటే ముందుగానే రాజకీయ నేతల పరామర్శలతో ఇప్పటం గ్రామం ఫుల్ బిజీగా మారింది.

Pawan Kalyan: మరోసారి ఇప్పటం గ్రామానికి జనసేనాని.. ఈనెల 27న బాధితులకు స్వయంగా ఆర్ధిక సాయం అందజేత
Janasena Ippatam
Follow us

|

Updated on: Nov 24, 2022 | 11:40 AM

జనసేన పార్టీ ప్లీనరీ సమయంలో వేదికగా మారి వార్తల్లోనిలిచింది మొదలు.. మొన్న రోడ్డు వెడల్పు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూలుస్తున్నారు అన్న వార్తలు వినిపించడం వరకూ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం వార్తలకు వేదికగా మారింది. తాజాగా మరోసారి ఈ నెల 27వ తేదీన ఇప్పటం గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు.. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఒక ప్రకటన చేశాయి. ఇప్పటం గ్రామంలోని పర్యటించి అక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులను మళ్ళీ జనసేనాని  పరామర్శించనున్నారు. రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్ల కు సంబంధించిన బాధితులను పరామర్శించి ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం పవన్ స్వయంగా అందజేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

గత కొన్ని రోజులుగా రాజకీయాలకు వేదికగా ఇప్పటం గ్రామం వార్తల్లో నిలుస్తోంది. ఎన్నికల కంటే ముందుగానే రాజకీయ నేతల పరామర్శలతో ఇప్పటం గ్రామం ఫుల్ బిజీగా మారింది. అయితే తమ పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ పవన్ గతంలోనే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పవన్ ఇప్పటం గ్రామ ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే ఆ గ్రామంలో ప్రభుత్వం కక్ష కట్టి.. ఇళ్లు, గోడలు కూల్చివేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తరువాత ఇప్పటం గ్రామానికి చేరుకుని అక్కడ కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు‌ సెటైర్లు వేస్తూ.. భారీగా ట్రోలింగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?