Andhra Pradesh: ఎలుగుబంటి కాళ్లు మాయం.. ఐదుగురి అరెస్ట్.. ఫారెస్ట్ ఆఫీస్ ముందు చెంచుల ఆందోళన..
ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట అయ్యన్నకుంట చెంచులు ఆందోళన దిగారు. ఎలుగుబంటి కేసులో ఐదుగురు గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వారిలో నలుగురు ఫారెస్ట్ ఆఫీస్..

ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట అయ్యన్నకుంట చెంచులు ఆందోళన దిగారు. ఎలుగుబంటి కేసులో ఐదుగురు గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వారిలో నలుగురు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పరారయ్యారని పోలీసులు చెప్పడంతో అటవీశాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు వారి బంధువులు. తమ వారిని మీరే మాయం చేశారంటూ నిరసన తెలిపారు.
వారం రోజుల క్రితం కొర్రపోలు రేంజ్ అటవీ పరిధిలో ఎలుగుబంటి మృతదేహాన్ని గుర్తించారు చెంచులు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని నాలుగు కాళ్లు మాయమైనట్లు గుర్తించారు. ఈ కేసులో.. ఐదుగురు గిరిజనులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఉండగా నలుగురు అనుమానితులు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పరారయ్యారని పోలీసులు చెప్పడంతో వారి బంధువులు నిరసనకు దిగారు. గిరిజనుల నిరసనకు టీడీపీ నేత ఎరిక్షన్ బాబు మద్దుతు తెలిపారు. ఆఫీసర్స్‌తో మాట్లాడారు. అయితే, తమ వారిని అప్పగించపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని గిరిజనుల హెచ్చరించారు.
తెలంగాణలో ఎలుగబంటి ఫియర్..
నిన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులిభయం బెంబేలెత్తించింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. లింగంపేట మండలం మోతే గ్రామ శివారులో రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి జనాన్ని హడలెత్తించింది. రోడ్డుపై కారులో వెళ్తున్న ప్రయాణికులకు ఎలుగుబంటి ఎదురవడంతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగు సంచారంతో ఏవైపు నుంచి ఎలుగుబంటి దాడిచేస్తుందోనని సమీప గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
