ప్రేమించాడు.. మంచి పొజిషన్ వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడనుకుంది.. కట్ చేస్తే.. డిసెంబర్ 31 రాత్రి.!
ప్రేమించాడు.. మంచి పొజిషన్ వచ్చింది. కానీ ఆమె పిచ్చిది. తననే పెళ్లి చేసుకుంటాడని అనుకుంది. పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చింది. కానీ ఈ మోసగాడు ప్లాన్ చేసి మరీ ఆ అమ్మాయి అడ్డు తొలగించుకున్నాడు. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

చిత్తూరు జరిగిన వికలాంగురాలు కవిత హత్య కేసులో నిప్పులాంటి నిజం బయటపడింది. నిందితుడు వికలాంగుల జాతీయ క్రికెట్ ప్లేయర్‌గా పోలీసుల దర్యాప్తు తేల్చింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు గిరింపేటకు చెందిన కవిత డిగ్రీ దాకా చదువుకుంది. వికలాంగురాలైన కవితకు ఎస్ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లికి చెందిన వికలాంగుడైన గణేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిచింది. కవితను ఇష్టపడ్డ గణేష్ పెళ్లి కూడా చేసుకోవాలనుకోవడంతో కవిత సంతోషపడింది. అదే ఆలోచనల్లో ఉండిపోయింది. అయితే ఒక్కసారిగా గణేష్‌కు కాలం కలిసి వచ్చింది. క్రికెట్‌లో రాణించిన గణేష్ అంతర్జాతీయ వికలాంగుల క్రికెట్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈ విషయం గణేష్‌ను ప్రేమించిన కవితకు సంతోషాన్ని కలిగించింది. అంతేకాకుండా గణేష్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ఇక కవిత ఆనందానికి హద్దులు లేకపోయింది. అయితే గణేష్‌కు మాత్రం కవితను ఎలాగైనా దూరం పెట్టాలన్న ఆలోచన ఏర్పడింది. కవిత మాత్రం ప్రేమించిన గణేష్ పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. అయితే కవిత ప్రేమను నిరాకరిస్తూ వచ్చిన గణేష్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు ప్లాన్ అమలు చేశాడు. ఈలోపే కవిత కూడా అదృశ్యమైంది.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
గత నెల 31న నుంచి కవిత కనిపించకపోగా.. చిత్తూరు 2 టౌన్ పీఎస్‌లో కవిత తమ్ముడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. 5 రోజుల తర్వాత ఈ నెల 7న గంగాధర నెల్లూరు వద్ద నీవానదిలో కవిత శవమై లభించింది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి వేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. వికలాంగురాలైన కవిత హత్యకు గురైనట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎస్ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లికి చెందిన గణేష్‌తో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుండడంతో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగింది. అంతర్జాతీయ వికలాంగుల క్రికెట్‌లో ఇండియా తరఫున ఆడిన గణేష్‌కు స్టేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం కూడా వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు కవితను వదిలించుకునేందుకు హత్య చేసి ఉండొచ్చని భావించారు. ఉద్యోగం రావడంతో కవిత ప్రేమ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన గణేష్ పక్కా ప్లాన్ అమలు చేసినట్లు గుర్తించారు.
ప్రేమించిన గణేష్‌పై పెళ్లి చేసుకోవాలని కవిత ఒత్తిడి తెచ్చి ఉంటుందని భావించారు. కవితను అంతమొందించాలని ప్రణాళిక రూపొందించిన గణేష్.. గత నెల 31న పెళ్లి చేసుకుందామని కవితను నమ్మించి తీసుకెళ్ళినట్లు నిర్ధారించుకున్నారు. కవితను హత్య చేసి నీవానదిలో తోసేసిన గణేష్ చేతులు దులుపుకోగా.. టెక్నికల్ అనాలసిస్ ద్వారా పోలీసులు ఎవిడెన్స్ సేకరించారు. ఈ మేరకు కేసును చేధించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు గణేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైవు గణేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ కవిత బంధువులు, వికలాంగులు ధర్నా చేపట్టారు.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
