కేరళలోని చారుమూరులో బిచ్చాటన చేసే అనిల్ కిషోర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడు. అందరూ సామాన్య బిచ్చగాడు అనుకున్న ఇతడి వద్ద లక్షలాది రూపాయలు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం అతను ఓ దుకాణం ముందు శవమై కనిపించడం పలు అనుమానాలకు దారితీసింది.