శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోతే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, జలదరింపు, వాపు, చల్లదనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు, మధుమేహం కారణం కావచ్చు. బాదం, వాల్నట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం, యోగా, వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.