Andhra Pradesh: పేరుకే బట్టల వ్యాపారం.. నడిపేదంతా ఆ యవ్వారమే.. సొంగ కార్చారో కథ కంచికే..

విజయవాడలో మాయాలేడీ హనీట్రాప్‌ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సోషల్‌ మీడియాలో ట్రాక్‌లో పెట్టి.. హనీట్రాప్‌ చేస్తోన్న ఓ మాయాలేడీ యవ్వారం కలకలం రేపుతోంది. ఇన్‌స్టాలో పరిచయం..

Andhra Pradesh: పేరుకే బట్టల వ్యాపారం.. నడిపేదంతా ఆ యవ్వారమే.. సొంగ కార్చారో కథ కంచికే..
Honeytrap
Follow us

|

Updated on: Nov 26, 2022 | 1:18 PM

విజయవాడలో మాయాలేడీ హనీట్రాప్‌ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సోషల్‌ మీడియాలో ట్రాక్‌లో పెట్టి.. హనీట్రాప్‌ చేస్తోన్న ఓ మాయాలేడీ యవ్వారం కలకలం రేపుతోంది. ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌కి చేరుతుంది. ఆపై కథ లక్షలుదాటుతోంది. అమాయకులకు ఎరవేసి వలవిసిరుతోన్న ఈ మాయాలేడీ.. జగత్‌కిలాడీ…క్రైమ్‌ కథా చిత్రం ఏంటో ఓ లుక్కేద్దాం.

పేరుకి బట్టల వ్యాపారం.. చేసేది అబ్బాయిలకు ఎరవేసే యవ్వారం..

ఇది ఎక్కడో కాదు విజయవాడ పడమటలో బట్టలవ్యాపారం వెనుక జరుగుతోన్న చాటు మాటు యవ్వారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సోషల్‌ మీడియాని తెగవాడేసుకుంటూ అమాయకులను ఆగం చేస్తోంది ఈ కిలాడీ. సోషల్‌ మీడియాలో ఫోజులిస్తూ సినీ స్టార్లను మించిపోయిన ఆవిడ గారి కళలు అన్నీ ఇన్నీ కావు. తానే రాణి అంటుంది. కాలరెగరేస్తూ సినిమా డైలాగులతో కంగాళీ చేస్తుంది. ఇన్‌స్టా, షార్ట్ వీడియోలో పంబరేపుతోంది.

అయితే ఇది బయటకు కనిపించే రీల్‌ సీన్‌.. కానీ రియల్‌ సీన్‌ వేరే ఉంది. ఈవిడగారి భామాకలాపం కథ వింటే.. ఎవ్వరైనా ఖంగుతినాల్సిందే. బట్టలషాపుపెట్టి, అమాయక యువతులను వల్లో వేసుకొని వారితో విటులకు వల విసురుతోంది ఈ అమ్మడు. ఈ జగత్‌కిలాడీ హనీట్రాప్‌లో పడిన ఓ బాధితుడు.. విజయవాడ సీపీ క్రాంతిరాణా తాతాను ఆశ్రయించడంతో ఆమె చీకటి వ్యాపారం గుట్టు రట్టయ్యింది.

ఇవి కూడా చదవండి

ఎలా ముగ్గులోకి దింపుతుందంటే..

ఇన్‌స్టాగ్రాంలో పరిచయాలు పెంచుకుని ముందుగా యువకులను వల్లో వేసుకుంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలౌతుంది. అమ్మాయిలతో ఎరవేస్తుంది. ఈమె హనీట్రాప్‌లో పడ్డారా అంతే సంగతులు. ముందుగా అమ్మాయిలను పంపి ఇద్దరూ ఏకాంతంలో ఉండగా ఫొటోలు క్లిక్‌ మంటాయి. ఆ తర్వాత విషయం వేరేగా ఉంటుంది. అడిగినంతా ఇవ్వకపోతే అర్థనగ్నఫొటోలో బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కి దిగుతుంది.

అచ్చం ఇలాగే ఓ యువకుడి దగ్గర రూ. 1.90 లక్షలు గుంజేసిందీ భామ. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ పడమటకు చెందిన ఓ ఈ లేడీ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ అబ్బాయికి వలవేసి.. మరొక అమ్మాయిని అతడితో హోటల్ కు పంపించింది. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన సదరు యువతి.. ఆ విటుడిని బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో.. బెంబేలెత్తిన ఆ యువకుడు ఈ లేడీకి రూ. 1.90 లక్షలు సమర్పించుకున్నాడు. విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఏసీపీ ఖాదర్ భాషా.

నిందితురాలు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. తమదైన స్టైల్‌లో విచారించి.. కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. విచారణలో వ్యవహారం బట్టబయలు కావడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈవిడగారి ఎరలో చిక్కుకున్నారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..