RRB Exam Dates 2026: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో యేళ్లుగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పోస్టుల రాత పరీక్షల తేదీలను మాత్రం RRB అప్పట్లో విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించిన..

హైదరాబాద్, జనవరి 8: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే మంత్రిత్వ శాఖ.. 2025లో పలు రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు కూడ ముగిశాయి. ఈ క్రమంలో తాజాగా పలు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ల పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ విధానంలో జరిగే పలు రాత పరీక్షల షెడ్యూల్‌లను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖాళీల భర్తీకి విడుదల చేసిన
ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే..
- 434 పారా మెడికల్ పోస్టులకు రాత పరీక్షలు మార్చి 10 నుంచి 12 వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి.
- 6,238 ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రాత పరీక్షలు మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.
- 9,970 పోస్టుల భర్తీకి అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరుగుతాయి.
- 2,569 పోస్టులకు విడుదల చేసిన జూనియర్ ఇంజినీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరిటెండెంట్, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (జేఈ/డీఎంఎస్/సీఎంఏ) నోటిఫికేషన్‌కు రాత పరీక్షలు ఫిబ్రవరి 19, 20, మార్చి 3 తేదీల్లో జరుగుతాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తమ ప్రిపరేషన్ సాగించవల్సి ఉంటుంది. అయితే ఆయా పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జామ్స్‌కు సంబంధించిన సిటీ వివరాలు తెలిపేందుకు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పరీక్షకు సరిగ్గా నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. అభ్యర్ధులు ఈ మేరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది.
ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




