AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల..

JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
JNVST 2026 Exam admit cards
Srilakshmi C
|

Updated on: Jan 08, 2026 | 2:36 PM

Share

హైదరాబాద్‌, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

నవోదయ ప్రవేశ పరీక్ష 2026 హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పరీక్ష తేదీ, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం చిరునామా, కీలక సూచనలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏదైనా వ్యత్యాసం లేదా స్పెల్లింగ్ తప్పు ఉంటే వారు వెంటనే సరిదిద్దు కోవడానికి NVSని సంప్రదించవల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పు వివరాలతో పరీక్ష కేంద్రానికి వెళ్తే అక్కడ అనర్హతకు దారితీయవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల చేశామని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ అభ్యర్థులకు సంబంధించిన 11వ తరగతి అడ్మిట్ కార్డులను మాత్రం తర్వాత విడుదల చేస్తామని NVS తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 2 విడతల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 2025 డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఇప్పటికే నిర్వహించారు. ఇక రెండవ దశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రాత్రి లైట్ వేసుకుని పడుకుంటున్నారా.. వెలుతురుంటే శరీరంలో..
రాత్రి లైట్ వేసుకుని పడుకుంటున్నారా.. వెలుతురుంటే శరీరంలో..
వన్ బై ఫోర్ సినిమా రివ్యూ..
వన్ బై ఫోర్ సినిమా రివ్యూ..
అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి
అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి
అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు..
అధికారినంటూ ఫోన్‌ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్‌ అంటూ బెదిరిస్తారు..
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..
అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..