మగాళ్ళను కుక్కలతో పోల్చిన హీరోయిన్.. ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్స్
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొందరు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి వార్తల్లో నిలుస్తుంటే మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ మగాళ్ల గురించి చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి.

రీసెంట్ డేస్ లో చాలా మంది సినీ సెలబ్రెటీలు రకరకాల వివాదాల్లో నిలుస్తున్నారు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ మంది సెలబ్రెటీలు పాపులర్ అవుతున్నారు. సెలబ్రెటీలు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్స్‌తో ఉతికిఆరేస్తున్నారు. సెలబ్రెటీల పై ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఓ హీరోయిన్ మగాళ్ల పై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో ఆమె ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మగవాళ్ళను కుక్కలతో పోల్చుతూ కామెంట్స్ చేసింది ఆ నటి. దాంతో ఆమె పై నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరు.? ఎందుకు ఆమె ఆ కామెంట్స్ చేసింది అనేది చూద్దాం.!
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించింది అందాల భామ రమ్య. ఈ అమ్మడు కన్నడతో పాటు తెలుగు, తమిళ్ లోనూ నటించింది. కళ్యాణ్ రామ్ నటించిన అభిమన్యు సినిమాలో మెరిసింది. అలాగే సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రమ్య .. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. కాగా సమాజంలో జరిగే విషయాల గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి పై కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె రియాక్ట్ అవుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె మగాళ్లను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేసింది.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
ఇటీవల వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై ఆమె స్పందించింది. వీధుల్లో తిరిగే కుక్కల్లో ఏది కరుస్తుందో, ఏది కరవదో ముందుగా తెలియదు అందుకే వీటిని తీసుకెళ్లి ప్రత్యేక కేంద్రాలలో ఉంచాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై అసహనం వ్యక్తం చేస్తూ.. రమ్య సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ” మగాళ్ల మైండ్ కూడా మనంముందుగా చదవలేము వాళ్ళు ఎప్పుడు అత్యాచారాలు చేస్తారో తెలియదు.. ఎప్పుడు హత్యలు చేస్తారో తెలియదు కాబట్టి మగవాళ్ళు అందరిని కూడా జైలులో పెడతారా.? అని రాసుకొచ్చింది. దాంతో ఆమె పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మగాళ్లను కుక్కలతో పోల్చడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్స్ రమ్య పై మండిపడుతున్నారు. గతంలోనూ రమ్య పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




