Hyderabad: శభాష్ పోలీస్.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వారు చేసిన పని సూపర్..!
సమస్యలు వస్తే తాము సేవకులుగా మారిపోతున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో తను పోలీస్ అన్న విషయం మరిచి పారిశుద్ధ్య కార్మికుడిగా మారిపోయాడు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గండిపేట ప్రాంతంలో చోటు చేసుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా స్నేహపూర్వక పోలీసు వ్యవస్థ పేరుతో తెలంగాణ పోలీసులు ప్రజలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో సేష్టన్ చుట్టూ తిరిగే వారిపట్ల సౌమ్యంగా వ్యవహరించి ఇరు పక్షాలకు సర్ధిచెప్పి శాంతియుత వాతావారణాన్ని నెలకొల్పతున్నారు. ఇక సమస్యలు వస్తే తాము సేవకులుగా మారిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో తను పోలీస్ అన్న విషయం మరిచి పారిశుద్ధ్య కార్మికుడిగా మారిపోయాడు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గండిపేట ప్రాంతంలో చోటు చేసుకుంది.
గురువారం (జనవరి 08) తెల్లవారుజామున రోడ్డుపై కంకర పడిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికులు గమనించిన మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఎంతకు రాకపోవడంతో.. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు స్వయంగా రంగంలోకి దిగారు. చీపురు చేతబట్టి కంకర ఎత్తి వేసి ఆదర్శంగా నిలిచారు.
గండిపేట పరిధిలోని పోలీస్ అకాడమీ సమీపంలో గురువారం ఉదయం వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ నుంచి కంకర రోడ్డుపై పడిపోయింది. దీంతో అప్ప జంక్షన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డులు భాస్కర్, శ్రీనివాస్ గమనించారు. వెంటనే జీహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఎంతకీ పారిశుద్ధ్య సిబ్బంది రాకపోయేసరికి స్వయంగా వారే రంగంలోకి దిగారు.
నార్సింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సూచనల మేరకు హోంగార్డు భాస్కర్, శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఓ చీపురు తీసుకుని రోడ్డుపై నుంచి స్వయంగా కంకరను ఎత్తిపోశారు. కంకరను తొలగించి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో చొరవ తీసుకుని పనిచేసిన ట్రాఫిక్ సిబ్బంది భాస్కర్, శ్రీనివాస్‌ను ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
