అనంతపురం జిల్లా రాయదుర్గం వద్ద మొలకలమూరు నుండి జిందాల్‌కు వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదం నుండి తృటిలో తప్పింది. నాలుగో వ్యాగన్ వద్ద లింక్ తెగిపోవడంతో ఇంజిన్ బోగీలను వదిలి 2.5 కి.మీ. ముందుకు సాగింది. స్థానికుల సమాచారంతో రైల్వే అధికారులు లోకో పైలట్‌ను అప్రమత్తం చేసి, విడిపోయిన బోగీలను తిరిగి అనుసంధానించారు.