Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 10, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దినఫలం (జనవరి 10, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెడతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి. బంధుమిత్రులకు అనేక రకాలుగా సహాయ సహ కారాలు అందిస్తారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా కొనసాగుతుంది. సమయం అనుకూలంగా ఉన్నందు వల్ల ఆదాయ ప్రయత్నాలను బాగా పెంచడం మంచిది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల బాధ్యతల్ని భుజాలకెత్తుకుని ఒత్తిడికి గురవు తారు. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. బంధువులతో కొన్ని అనుకోని చికాకులుంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత, సామరస్యం బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. దగ్గర బంధువులతో ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వీలైనంతగా అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతి లభించడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. ఖర్చులు చాలావరకు అదుపులో ఉంటాయి. పొదుపు మార్గాలు కూడా అనుసరిస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల్ని జోక్యం చేసుకోనివ్వవద్దు. సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాల సందర్శన చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయ పడే స్థితిలో ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేసి లాభపడతారు. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడించే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సోదర వర్గం నుంచి ఊహించని ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలకు అవకాశముంది. మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది.