AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Planadu: పల్నాడులో ఆశ్చర్యకర ఘటన.. కత్తులు దూసే నేతలను కలిపిన గోమాత

పల్నాడు అంటేనే పగలు, సెగలు గుర్తొకొస్తాయి. రాజకీయ నాయకులు ఢీ అంటే ఢీ అంటుంటారు. నర్సరావుపేటకు చెందిన వారిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్ధులే. గత కొంతకాలంగా అవినీతి దగ్గర నుంచి హత్య రాజకీయాలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అబద్దాల అరవిందబాబు అని ఒకరు అంటే.. గొడ్డలి గోపిరెడ్డి అని మరొకరు అంటున్నారు. కత్తులు నూరుకుంటున్న రాజకీయ ప్రత్యర్ధులు ఒక్క విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. అదేమిటంటే గో చికిత్స.... 

Planadu: పల్నాడులో ఆశ్చర్యకర ఘటన.. కత్తులు దూసే నేతలను కలిపిన గోమాత
Political Rivals Together
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 27, 2025 | 8:34 PM

Share

ప్రతి ఆదివారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి పట్టణంలో గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పారిశుద్యం, ప్రజల సమస్యలు, త్రాగునీరు పంపిణి వంటి అంశాలపై నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన స్టేషన్ రోడ్డులో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహానం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆవు కనిపించింది. రక్తం మడుగులో ఉన్న ఆవును చూసి ఆయన చలించిపోయారు. వైద్యుడు కావడంతో వెంటనే చికిత్స అందించారు. కట్టు కట్టించారు. అదే సమయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు. స్థానికులు గుమికూడటాన్ని చూసి ఆయన కూడా ఆవు దగ్గరకు వచ్చారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నా అరవింద్ బాబు కూడా సిబ్బందికి తగు సూచలను చేశారు. వెంటనే ఆవును వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వాళ్లద్దరూ ఒకే చోట చేరడంపై స్థానికులు చర్చించుకున్నారు.

అయితే ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కనీసం విష్ కూడా చేసుకోకపోవడం ఒకరంటే మరొకరికి తెలియదనట్లు ప్రవర్థించడంపై మాత్రం పట్టణ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్ధులను మాత్రం ఆవు కలిపిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి