Nellore Weather: నెల్లూరు జిల్లాలో భారీ వర్షం.. హైఅలెర్ట్ ప్రకటించిన అధికారులు
మొన్నటి వరదలకే అల్లాడిపోయిన నెల్లూరు ప్రజలను.. వరుణుడు మరోసారి వణికిస్తున్నాడు. జిల్లాలో రెయిన్ ఎపిసోడ్ 2 స్టార్ట్ అయింది.
మొన్నటి వరదలకే అల్లాడిపోయిన నెల్లూరు ప్రజలను.. వరుణుడు మరోసారి వణికిస్తున్నాడు. జిల్లాలో రెయిన్ ఎపిసోడ్ 2 స్టార్ట్ అయింది. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. జోరు వానలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కండలేరు నీటి విడుదలతో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. గూడూరు పరిసరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారిపైకి వరదనీరు చేరడంతో మనుబోలు పొదలకూరు మధ్య రాకపోకలు బందయ్యాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. గూడూరు వెంకటగిరికి మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక భారీ ప్రవాహానికి కండలేరు జలాశయం ప్రమాదం అంచుల్లో ఉంది. జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. ఏ క్షణంలో కట్ట తెగిపోతుందనే భయం.. స్థానికులను వెంటాడుతోంది. కండలేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 68 TMCలు కాగా.. ప్రస్తుతం 60 TMCల నీరు ఉంది. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Telangana: బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్