Onion Farmers: రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిపంట.. చెన్నై మార్కెట్ లో 500 క్వింటాళ్ళ ఉల్లి పశువుల పాలు..

Onion Farmers: ఏపీలోని గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యమైంది. పంటలు నీట మునిగి దిగుబడి తగ్గింది.  దీంతో ఓ వైపు కూరగాయల రేట్లు పెరిగి..

Onion Farmers:  రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిపంట.. చెన్నై మార్కెట్ లో 500 క్వింటాళ్ళ ఉల్లి పశువుల పాలు..
Onion Farmer
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:02 PM

Onion Farmers: ఏపీలోని గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యమైంది. పంటలు నీట మునిగి దిగుబడి తగ్గింది.  దీంతో ఓ వైపు కూరగాయల రేట్లు పెరిగి సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తుంది. మరోవైపు పంట నాశనం కావడమే కాదు.. చేతికి వచ్చిన ఉల్లి పంట నీట తడిసి అన్నదాతను ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి ఉల్లి రైతు హుసేని ఉల్లిపాయలు కన్నీరు పెట్టించాయి.  వివరాల్లోకి వెళ్తే..

ఉల్లి రైతు హుసేని సహా 15 మంది రైతులకు చెన్నై కు చెందిన కమిషన్ ఏజెంట్ ఉల్లి పంటను చెన్నై మార్కెట్ కు తీసుకుని రమ్మనమని చెప్పాడు. దీంతో కమిషన్ ఏజెంట్ మాటలను నమ్మిన రైతులు ఉల్లి పంటను రూ. 15 వేలు ఖర్చు పెట్టి. కర్నూలు కోసిగి నుంచి చెన్నై మార్కెట్ కు లారీలో తరలించారు. అయితే రైతులు చెన్నై వెళ్లినప్పటి నుంచి జోరుగా వానలు కురుస్తూనే ఉన్నాయి.  ఉల్లి పాయలు తడిచిపోయాయి. తడిచిన ఉల్లిపాయలను కొనడానికి మార్కెట్ లోని ఏ వ్యాపారి ముందుకు రాలేదు. తడిచిన ఉల్లి పంట, పంట కోసం పెట్టిన పెట్టుబడి, దారి ఖర్చులు గుర్తుకొచ్చిన రైతులు చెన్నై మహానగరంలోని మార్కెట్లో కంటతడి పెట్టారు.  తడిచిన ఉల్లిపాయలను వెనక్కి తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ లారీకి డీజిల్ ఖర్చులు లేకపోవడంతో.. మార్కెట్ లో పశువులకు తమ ఉల్లిపాయలను పోశారు. దాదాపు 500 500 క్వింటాళ్ల ఉల్లి పశువుల పాలయినట్లు తెలుస్తోంది.

Also Read:  ఒమిక్రాన్ లక్షణాలు ఏమిటి.. ప్రమాద స్థాయి ఏ రేంజ్ లో ఉంది… ఈ వైరస్ ఎవరికీ సోకుతుందో చెప్పిన సౌతాఫ్రికా డాక్టర్..