Amaravati Farmers: అమరావతి రైతులకు బాసటగా వైసీపీ ఎమ్మెల్యే.. ఏ సాయం కావాలన్నా ఫోన్ చేయాలని సూచన
నెల్లూరు జిల్లాలో ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. అమరాతినే ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాడ్ చేస్తూ.. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లాలో ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. అమరాతినే ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాడ్ చేస్తూ.. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది. టీడీపీ శ్రేణులు అమరావతి రైతులకు బాసటగా నిలుస్తూ వస్తున్నారు. ప్రజంట్ నెల్లూరు రూరల్ కొత్తూరు వద్ద అమరావతి రైతుల శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆదివారం, సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అటుగా వెళ్తూ అమరావతి రైతుల శిబిరంలోకి వెళ్లారు. వర్షాల వల్ల ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే, రైతులకు తన ఫోన్ నంబర్ ఇచ్చారు. తన నియోజకవర్గం దాటే వరకు రైతులకు తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈ మాట చెప్పగానే అక్కడున్న రైతులంతా చప్పట్లు కొట్టారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాట్లాడిన అమరావతి రైతులు..’ జై అమరావతి’ అనాలని ఆయనను కోరారు. వారి ప్రతిపాదననను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
స్థానిక ఎమ్మెల్యేగా పర్యటనలో భాగంగా అమరావతి రైతులను చూసి ఆగానని… వర్షాల వల్ల ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆదుకోవడం తన బాధ్యత అని కోటంరెడ్డి తెలిపారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇటీవల 3 రాజధానుల బిల్లును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి పక్కా ప్రణాళికతో, నిపుణులను సంప్రదించి.. న్యాయపరమైన చిక్కులు లేకుండా మళ్లీ బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Also Read: ఓయూలో సమాధి కలకలం.. టెన్షన్‌లో విద్యార్థులు
బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్
